CPI : ప్రజా దీవెన,శాలిగౌరారం : తెలంగాణలో అధికారంలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటిం చిన 6 గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని సిపిఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 20న ఛలో హైదరా బాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని CPI (M-L) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి సాగర్, ఏ.ఐ.కె.ఎం.ఎస్ జిల్లా అధ్యక్షుడు జ్వాల వెంకటేశ్వర్లు, జిల్లా నాయకుడు వేముల శంకర్ పిలుపునిచ్చారు. శాలిగౌరారం మండల కేంద్రం లో చలో హైదరాబాద్ పోస్టర్ ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటై 14 నెలలు పూర్తవుతున్నా ఇప్పటివరకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల ను, హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. వెంటనే ఇల్లులేని పేదలందరికీ ఇండ్లు, నూతన రేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేసారు.షరతులు లేకుండా రెండు లక్షల రైతు రుణమాఫీ చేయా లన్నారు. రైతు భరోసా15 వేలు, మహాలక్ష్మి పథకానికి తులం బంగా రం కలిపి ఇవ్వాలన్నారు.
ఇవేకాక 420 హామీలను ఎన్నికల మేని ఫెస్టోలో పొందుపరిచి వాటి ఊసెత్తడం లేదన్నారు. రోజుకో పార్టీలు మారే దొంగలను పార్టీలో చేర్చుకోవడంలో ఉన్న శ్రద్ధ ఇచ్చిన హామీలు అమలు చేయడంలో లేదన్నారు.డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీలో అనేక అవకతవక లకు పాల్పడుతున్నారని విమర్శించారు. రైతాంగం పండించిన పంట లకు గిట్టుబాటు ధర లేక పంటలు సరిగా పండక పెట్టుబడులు రాక అప్పుల పాలవుతూ ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
ప్రజా సంపదను లూటీ చేయడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన కొనసాగుతుందన్నారు. వెంటనే ఇచ్చిన హామీల అమ లుకై ఆరు గ్యారెంటీలను తక్షణం అమలు చేసే వరకు ప్రజా పోరాటా లను ఉదృతం చేస్తామన్నారు.ఇందుకోసం ఈనెల 20వ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చా రు. గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలనే నేటి కాంగ్రెస్ ప్రభుత్వం పాటిస్తుందని ఎద్దేవాచేశారు.
ఈ విధానాలపై ఈనెల 20న న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ నిర్వ హిం చే ఛలో హైదరాబాద్ కార్యక్రమంలో ప్రజలు, ప్రజాస్వామిక వాదులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ పార్టీ నాయకులు పోలేపాక ఎల్లయ్య, యానాల సత్తిరెడ్డి, పి.ఇజ్రాయిల్, డి.రాజు, వెంక ట్ రెడ్డి,సుధాకర్, మధు తదితరులు పాల్గొన్నారు.