Posh Act: ప్రజాదీవెన, నల్గొండ టౌన్: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో పనిచేసే చోట లైంగిక వేధింపులకు గురవుతున్న మహిళల సహాయ కేంద్రం వారు శనివారం కలెక్టరేట్ లో పోష్ చట్టం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి డి. దీప్తి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. పనిచేసే చోట మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన చట్టాలపై ప్రతి మహిళ అవగాహన కలిగి ఉండాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి,సిడిపిఓ కృష్ణవేణి, న్యాయవాది కె.వి.రమణారావు, దీప్తి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్, కె.వి.కృష్ణవేణి జిల్లా సంక్షేమ అధికారి, ప్రేమ్ కరణ్ రెడ్డి జిల్లా పరిషత్ సీఈవో, సుచరిత, డిఎఫ్ఓ అరుంధతి, జిల్లా వైద రాజ్ కుమార్, పిడి హౌసింగ్, శైలజ, డిఈ డబ్ల్యూఐడిసి , కే. వి రమణరావు, పిపీలు తదితరులు పాల్గొన్నారు.