MCPI Meeting: ప్రజా దీవెన, శాలిగౌరారo: భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ ఐక్య ఎంసీ పి ఐ (యూ )తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశాలు పోరాటాల పురిటి గడ్డ ఉమ్మడి నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ఈనెల 18 .19 తేదీలలో స్వాగత్ గ్రాండ్ హోటల్ లో నిర్వహిస్తున్నట్లు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వరికుప్పల వెంకన్న, సూర్యాపేట జిల్లా కార్యదర్శి షేక్ నజీర్ లు తెలిపారు.
వారు శాలిగౌరారం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట యోధులు ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎంసీపీఐయు ఎర్రజెండా ముద్దుబిడ్డలు అమర జీవులు మాజీ ఎంపీ కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ మద్దికాయల ఓంకార్, జన్మనిచ్చిన ఈ గడ్డపై జరిగే పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశాలు విజయవంతం చేయాలని వారు కోరారు.ఈ సమావేశాలకు తెలంగాణ రాష్ట్రంలోని 25 జిల్లాల నుండి పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు. జిల్లా కార్యదర్శులు హాజరవుతున్నారని తెలిపారు.