Osmania Hospital: ప్రజా దీవెన హైదరాబాద్: ఆసుపత్రి బాధ్యుల నిర్వాహక మూలంగా ఓవర్గ్గిరాలు ఆసుపత్రి నుంచే గెంటివేతకు గురైన సంఘ టన రాష్ట్ర రాజధాని హైదరా బాదు లో జరిగింది. ఆధార్ కార్డు లేదని ఆసుపత్రి నుండి మహిళకు వైద్యం చేయకుండా గెంటేసిన ఉస్మానియా ఆసుపత్రి సిబ్బంది నిర్వాకం నలు మూలల పెద్ద ఎత్తున వైరల్ అవు తోoది.
వివరాలు లోకి వెళ్తే, మహ బూబ్ నగర్ జిల్లా మారేడుపల్లికి చెందిన ప్రమీల భర్త సురేష్ ఆరు నెలల క్రితం అనారోగ్యంతో మరణించాడు.భర్త మృతి చెందిన నెల రోజులకే కొడుకు రోడ్డు ప్రమాదంలో మరణించాడు.అయితే తన ఆరేళ్ల కూతురితో హైదరాబాద్ వచ్చిన ప్రమీలకు అనారోగ్యంతో కదలలేని స్థితికి రావడంతో ఉస్మానియా ఆసుపత్రికి వెళ్తే ఆధార్ కార్డు లేదని వైద్యం చేయడానికి నిరాకరించారు సదరు ప్రబుద్ధ ఆసుపత్రి సిబ్బంది.
ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఆసు పత్రి ఆరు బయట దయనీయ స్థితిలో పడుకొని ఉన్న మహిళను చూసిన వారంతా అయ్యో పాపం అంటూ ముక్కున వేలేసుకొని అక్క డ నుంచి ముందుకు కదిలారు. ఏం చేయాలో తెలియని చిన్నారి అనూ ష తల్లిని వడిలో పడు కోపెట్టుకుని సహాయం చేసే వారికోసం ఎదురు చూస్తున్న మహిళను ప్రతి ఒక్కరూ సానుభూతి వ్యక్తం చేశారు.