Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

KCR Birthday: లండన్ కేసీఆర్ జన్మదినం వేడుకలు

KCR Birthday: ప్రజా దీవెన,లండన్ : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినo పురస్కరించుకుని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,మాజీ ఎంపీ సంతోష్ కుమార్‌ ల పిలుపు మేర కు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టిన వృక్షార్చనలో ఎఫ్దీసి మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం పాల్గొన్నారు. కుటుంబసమేతంగా పాల్గొని లం డన్ లో మొక్కని నాటారు. ఈ సందర్భంగా కెసిఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపి భగవంతుని ఆశీస్సులతో వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్టు ఆయన తెలిపారు.అందరూ వృక్షార్చనలో పాల్గొని “ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి” విజయవంతం చేయాలని కోరారు. పచ్చదనం కోసం మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ చేస్తున్న కృషి చాలా గొప్పదని, ఇందులో అందరూ భాగస్వాములవ్వాలని కోరారు. రాబోయే తరాలు సంతోష్ పేరుని ఖచ్చితంగా గుర్తుపెట్టు కుం టాయని, “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ఒక చారిత్రాత్మక కార్యక్రమంగా చరి త్రలో నిలిచిపోతుందని పేర్కొన్నా రు.