Chairperson Thirupathamma Sudheer: ప్రజా దీవెన,కోదాడ,: కోదాడ వ్యవసాయ మార్కెట్ లో రైతులకు కావలసిన సౌకర్యాలకు కృషి చేస్తున్నట్లు కోదాడ వ్యవసాయం మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఏపూరి తిరుపతమ్మ సుధీర్ అన్నారు.ఆదివారం కోదాడ కెవ్యవసాయ మార్కెట్ యార్డ్ ను పరిశించి రైతులతో మాట్లాడారు వ్యాపారస్తులు,రైతులు శనివారం,ఆదివారాలలో పశువుల సంతలో జరిగే పశువుల క్రయవిక్రయాలు స్వేచ్ఛగా నిర్భయంగా వ్యాపారం చేసుకోవచ్చన్నారు.మార్కెట్ యార్డ్ లో తాగునీరు తోపాటు పశువులకు వ్యాపారస్తులకు రైతులకు సౌకర్యాలు కల్పిస్తామన్నారు.
సమస్యలను వైస్ చైర్మన్ పాలకవర్గ సభ్యులతో కలిసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి దృష్టికి తీసుకువెళ్తామన్నారు.రైతులు వ్యాపారులు దళారులను నమ్మి మోసపోవద్దు అన్నారు.వ్యాపారస్తులు రైతులు నేరుగా ప్రశాంతంగా సంతలో వ్యాపారాలు చేసుకోవాలని కోరారు.రైతులు సంతకు వచ్చి పశువులను కొనుక్కొని వెళ్లే సమయంలో కొంతమంది ప్రైవేటు వ్యక్తులు గేటు వద్ద పోలీస్ పిసి వసూలు చేస్తున్నారని రైతులు చైర్ పర్సన్ కు విన్నవించుకున్నారు.అంతేకాకుండా ఆంధ్ర ఇతర గ్రామాల నుండి పశువులను వాహనాలలో సంతకు తీసుకొచ్చే సమయంలో పోలీసులు ఆపి ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు చైర్ పర్సన్ వద్ద వాపోయారు.ఈ సమస్యలపై ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు.ఈ కార్యక్రమంలో కమిటీ మెంబర్ పోలంపల్లి వెంకటేశ్వర్లు,సెక్రటరీ రాహుల్ సిబ్బంది తదితరులు ఉన్నారు.