Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

KCR Birthday : నల్లగొండ లో ఘనంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు

–మెడికల్ కళాశాల ముందు కేక్ కటింగ్

–జిల్లా పార్టీ కార్యాలయంలో వృక్షా ర్చన

KCR : ప్రజా దీవెన, నల్లగొండ: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట చంద్రశేఖర రా వు జన్మదిన పురస్కరించుకొని నల్ల గొండ జిల్లాకేంద్రంలో పలు కార్యక్ర మాలను పెద్ద ఘనంగా వేడుకలు నిర్వహించారు. ప్రారంభంలో ప్రభు త్వ మెడికల్ కళాశాల ఎస్ఎల్బీసీ నందు మాజీ మంత్రి గుంటకండ జగదీశ్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు రమావత్ రవీంద్రకుమార్, జెడ్పీ మా జీ చైర్మన్ బండారు నరేందర్ రెడ్డి,స్థానిక మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి కేక్ కట్ చేసి కెసిఆర్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని ఆ కాంక్షించారు. అనంతరం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన కా ర్యక్రమంలో ముందు వృక్షార్చనలో పలు మొక్కలను నాటారు, అనం తరం ఏర్పాటు చేసిన రక్తదాన శిబి రంలో పెద్ద సంఖ్యలో రక్తదాతలు పాల్గొన్నారు, తర్వాత కేక్ కట్ చేసి కేసీఆర్ కు జిల్లా ప్రజల పక్షాన పార్టీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేశా రు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి మాట్లా డుతూ క్రమక్రమంగా కాంగ్రెస్ ప్రభు త్వం ప్రజలకు దూరం అవుతుంద ని కెసిఆర్ ఆనవాళ్ళు లేకుండా చే స్తామన్న రేవంత్ రెడ్డి కి గుణపా ఠంగా తాము ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎక్కడెక్కడ అభివృద్ధి కా ర్యక్రమాలు పెద్ద ఎత్తున చేశామో ఆ ప్రాంతాల్లో కేసీఆర్ జన్మదినోత్స వ వేడుకలు జరుపుతున్నామని, దానిలో భాగంగానే, ఉదయమే యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు ని ర్వహించామని, భువనగిరి నూతన కలెక్టరేట్ వద్ద కెసిఆర్ జన్మదిన ది నోత్సవ వేడుకలు చేశామని, అలా గే ఇక్కడ నల్లగొండలో మెడికల్ క ళాశాల,వద్ద మిర్యాలగూడలో యా దాద్రి పవర్ ప్లాంట్, సూర్యాపేటలో మిషన్ భగీరద్ ల వద్ద కెసిఆర్ జ న్మదిన వేడుకలుఘనంగా నిర్వహి స్తున్నామని, ఇది చూసైనా కాంగ్రెస్ ప్రభుత్వం తాము ఏం చేశామో అ ని తెలుసుకుంటుంది అని ఆశిస్తు న్నామన్నారు, కెసిఆర్ ఆనవాళ్లు చెడగొట్టడం ఎవరి తరం కాదని అన్నారు.

 

ప్రజల తమకేదో మేలు చేస్తారని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే ప్రజల ఆశలను వమ్మ చే సిందని కెసిఆర్ నాయకత్వంలో 14 సంవత్సరాలు పోరాడి తెచ్చు కున్న తెలంగాణను, మళ్లీ సమై క్యాంధ్ర పాలకుల వద్దకు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకపోతుందని వారి అడుగుజాడల్లో నడుస్తుందని.. ఈ విషయాలన్ని ప్రజలు గ్రహిస్తు న్నా రని ఈ 15 నెలల కాలంలోనే ప్రభు త్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెల కొందని ప్రభుత్వ వైఫల్యాలపై కెసి ఆర్ నాయకత్వంలో ప్రజల పక్షాన నిలబడి పోరాడుతామన్నారు.ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు చెరుకు సుధాకర్, రాష్ట్ర కార్పోరేషన్ మాజీ చైర్మన్ కటికం సత్తయ్య గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చీరా పంకజ్ యాదవ్, బొర్ర సుధాకర్, నిరంజన్ వలి, మాలే శరణ్య రెడ్డి,

 

మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి, సైదిరెడ్డి, అభిమన్యు శ్రీనివాస్ మా జీ ఎంపీపీ కరీం పాషా, మాజీ జెడ్పి టిసి తండు సైదులు గౌడ్, మైనం శ్రీనివాస్, కంచనపల్లి రవీందర్రావు బొజ్జ వెంకన్న, వంగాల సహదేవరె డ్డి, కొండూరు సత్యనారాయ ణ, పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, తిప్పర్తి కనగల్ నల్గొండ మండల పార్టీ అధ్యక్షులు పల్ రెడ్డి రవీందర్ రెడ్డి అయితగోని యాద య్య దేప వెంకటరెడ్డి, మారగోని గణేష్, జమాల్ ఖాద్రి, సయ్యద్ జాఫర్,రంజిత్, కందుల లక్ష్మయ్య తవిటి కృష్ణ, మాజీ ఎంపీటీసీలు బడుపుల శంకర్, సుంకి రెడ్డి వెంకట్ రెడ్డి పొగాకు గట్టయ్య, ఊట్కూరు సందీప్ రెడ్డి, మాజీ సర్పంచ్ లు మేకల అరవింద రెడ్డి, గుండెబోయిన జంగయ్య, దండం పెల్లి సత్తన్న, లతీఫ్,దొడ్డి రమేష్, పెరిక యాదయ్య వీరమల్ల భాస్క ర్, మహిళా నాయకులు,యాట జయప్రద రెడ్డి,కున్ రెడ్డి సరోజ, గాలి రాధిక మర్రి రేణుక భారీ సం ఖ్యలో కేసీఆర్ అభిమానులు కార్య కర్తలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.