ఆదాయంలో అందలం, అయోధ్య రామమందిర్ టాప్
AyodhyaRammandhir: ప్రజా దీవెన, అయోధ్య: అయోధ్య రామ మందిరం ఆది నుంచి దేశం లోనే కాకుండా ప్రపంచంలో చరిత్ర సృష్టింస్తూనే ఉంది. రామ మందిరం నిర్మాణం నుంచినేటి వరకు ఏదో ఒక అంశంలో ప్రత్యేకతను సంతరించుకుంటూనే వస్తుంది. అ యోధ్యలోని నూతన రామాల యం లో బాలరాముని విగ్రహ ప్రతి ష్ఠాపన నుంచి భక్తులు తండోప తండాలుగా తరలివస్తున్నారు.
తాజాగా కానుకల విషయంలో అయోధ్య మ రో సారి చరిత్ర సృష్టిం చిoది. దేశం లో ప్రసిద్ధి గాంచిన షిర్డీ, వైష్ణో దేవి అలయాలను మిం చి దూసుకెళ్తోం ది. గడచిన ఏడాదిలో అయో ధ్య కు రూ. 700 కోట్ల ఆదాయంతో అందలoలో నిలిచింది. భక్తులు స మర్పిస్తున్న కానుక ల విషయంలో షిర్డీ ఆలయానికి ఏటా రూ. 450 కోట్ల వరకూ ఆదా యం సమకూరుతుండగా, వైష్ణోదేవికి రూ. 400 కోట్ల వరకూ ఆదా యం వస్తుంది. తాజాగా అయోధ్య రామ మందిరంకు రూ. 700 కోట్ల ఆదాయం సమకూరడo గమనార్హం.