Collector Tripati: ప్రజా దీవెన, నల్లగొండ: ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు గ్రామా ల సందర్శన సందర్భంగా పాఠశా లలు, హాస్టళ్లలో అత్యవసరంగా పనులు చేపట్టాల్సి వస్తే ప్రతిపాద నలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. సోమవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ని సమావేశ మందిరంలో ఎం ఎస్ ఓ లు, ఎంఈఓ లు, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులు, ఎంపీడీవో లతో సమీక్ష నిర్వహిం చారు.అమ్మ ఆదర్శ పాఠశాల పను లే కాకుండా, ఎక్కడైనా అత్యవస రమైతే తమ దృష్టికి తీసుకురా వాలని అన్నారు. అలాగే ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు గ్రామాల సందర్శన సందర్భంగా పాఠశాలలు ,హాస్టల్లో అత్యవసర పనులు గుర్తించినట్లయితే వెంటనే ప్రతిపాదనలు పంపించాల్సిందిగా కోరారు .
హాస్టళ్లు, పాఠశాలల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన భోజనం, గుణాత్మక విద్యను అందించాలని చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని, ముఖ్యంగా విద్య, భోజనంలో విషయంలో నాణ్యతతో రాజీ పడవద్దు అని అన్నారు.పాఠశాలలు,హాస్టళ్లు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
గృహ నిర్మాణ శాఖ పీడి రాజ్ కుమార్ ఇందిరమ్మ ఇండ్ల జాబితాల పరిశీలన పై మాట్లా డారు.ఈ సమావేశానికి అదన కలెక్టర్ జై శ్రీనివాస్, డి ఆర్ డి ఓ శేఖర్ రెడ్డి, పంచాయతీరాజ్ ఈ ఈ, డీఈవో బిక్షపతి, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు ఎంఈ వోలు, తదితరులు హాజరయ్యారు.