SI Harassment : ప్రజా దీవెన, భూపాలపల్లి: అక్కడా ఇక్కడా ఎక్కడ చెప్పుకున్నా సమ స్యకు పరిష్కారం లభిస్తలేదు, ఇక బలవర్మరణమే శరణ్యం అంటూ ఆ వృద్ధ దంపతులు లబోదిబోమం టున్నారు. ఈ క్రమంలో ఆత్మహత్య కు అనుమతించండి సార్ అంటూ ఫ్లెక్సీతో భూపాలపల్లి కలెక్టరేట్ ఎదుట వృద్ధ దంపతుల ఆందో ళనకు దిగారు. వివరాల్లోకి వెళ్తే భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం వేములపల్లికి చెందిన సంది సులోచన, ప్రతాప్ రెడ్డి దంపతులకు 12 ఎకరాల భూమి ఉంది.ఈ భూమికి వెళ్లడానికి ఉన్న దారిని రెండున్నరేళ్లుగా ములుగు జిల్లా కన్నాయిగూడెం ఎస్సైగా పనిచేస్తున్న ఇనిగాల వెంకటేష్, అతడి సోదరుడు, తండ్రి కలిసి మూసివేశారని ఆ వృద్ధ దంప తులు ఆరోపిస్తున్నారు.
దీనిపై హైదరాబాద్ వెళ్లి ప్రజావా ణిలో ఫిర్యాదు చేస్తే ఆ ఎస్ఐ మాపై అక్రమ కేసులు పెడుతున్నా రని ఆందోళన వ్యక్తం చేశారు.
మూడేళ్లుగా పొలానికి వెళ్లలేక వ్యవసాయం చేయట్లేదని తమకు ఆత్మహత్యే దిక్కని, ఆత్మహత్యకు అనుమతించాలని ఫ్లెక్సీతో భూపా లపల్లి కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు.