Interim bail for Chandrababu: చంద్రబాబుకు మధ్యంతర బెయిల్
-- ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా హైకోర్టు తీర్పు
చంద్రబాబుకు మధ్యంతర బెయిల్
— ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా హైకోర్టు తీర్పు
ప్రజా దీవెన/ అమరావతి: ఆంద్రప్రదేశ్ స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు ( High Court grants interim bail to TDP chief Chandrababu) చేసింది. మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం పిటీషన్ పై హైకోర్టు తీర్పు వెలువరించింది. తీర్పు లో భాగంగా నాలుగు వారాల పాటు బెయిల్ ను మంజూరు చేసింది.
కంటి శస్త్ర చికిత్స ఇప్పుడు అవసరం అన్న వాదనను పరిగణనలోకి తీసుకోవడంతో ఆయనకు హైకోర్టులో ఊరట లభించింది. చంద్రబాబు ఈ కేసులో తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ వేసుకున్న పిటీషన్ పై విచారణ పూర్తయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసిన విషయం ( The High Court has heard the arguments of both parties and has reserved its verdict) విదితమే.
స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్టయిన చంద్రబాబు రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటున్నారు. ఆయన 53రోజుల నుంచి జైలులోనే ఉంటుండగా ఆయన కుడి కంటికి శస్త్ర చికిత్స చేయాలని ( He had to undergo surgery on his right eye while he was in jail for 53 days) వైద్యులు తెలిపారు.
చంద్రబాబు తరుపున న్యాయవాదులు కూడా ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని బెయిల్ ఇవ్వాలని ( He should be granted bail keeping in view his health condition) న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. దీంతో నాలుగు వారాల పాటు బెయిల్ మంజూరు చేసింది.