–దళితబందు సాధన రాష్ట్ర అధ్య క్షుడు కొగిలా మహేష్
Kogila Mahesh : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకం రెండవ విడ త అర్హులైన లబ్ధిదారులకు ప్రొసీ డింగ్స్ ఇచ్చి నిధులు కేటాయిం చిం దని ఎన్నికల నోటిఫికేషన్ వలన ఆగిపోయిన నల్లగొండ నియోజకవ ర్గంలోని 1050 మంది దళిత లబ్ధి దారులకు వెంటనే నిధులు విడుద ల చేయాలని దళిత బంధు సాధన కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు కోకిల మహేష్ రాష్ట్ర ప్రభుత్వన్ని డిమాం డ్ చేశారు. మంగళవారం నల్లగొండ అంబేద్కర్ భవనంలో దళిత బం ధు సాధన కమిటీ ఉమ్మడి జిల్లా బాధితుల సమావేశం బడుపుల శంకర్ అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ దళిత బంధు నిధులు విడుదలై నేటికీ దళిత లబ్ధిదారులకు అం దించకపోవడం అన్యాయమని అన్నారు.రాష్ట్రంలో హుజూరాబాద్ మధిర నియోజకవర్గాలలో రెండవ విడత దళిత బంధు అమలు చేసి నల్లగొండ జిల్లాలో అమలు చేయక పోవడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వాలు మారినా దళితుల రాతలు మారలేదని దళితుల పేర మంజూరైన నిధులను వెంటనే వి డుదల చేయాలని కోరారు.లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారు లతో పెద్ద ఎత్తున పోరాడుతామని తెలియజేశారు. ఇప్పటికే రాష్ట్రస్థా యిలో మంత్రులకు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చామని తెలి పారు. అయినప్పటికీ స్పందించక పోవడం అన్యాయమని అన్నారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సం ఘం నల్లగొండ జిల్లా ప్రధాన కార్య దర్శి పాలడుగు నాగార్జున మా ట్లాడుతూ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేవెళ్లలో ప్రకటించిన ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ప్రకారంగా అంబేద్కర్ అభయ హస్తం పేరా 12 లక్షల రూపాయల పథకం ఏమైందని ప్రశ్నించారు. దళితుల కోసం ప్రక టించిన పథకాల అమలు చేయు టకు చిత్తశుద్ధి లేకపోవడం అన్యా యమని అన్నారు.
నల్లగొండ ఉమ్మ డి జిల్లాలో లబ్ధిదారుల ఎంపిక జరి గి ప్రొసీడింగ్స్ ఇచ్చి బ్యాంకులో అకౌంట్ లు ఓపెన్ చేసి కలెక్టర్ అకౌంట్లో నిధులు జమ చేసిన వాటిని వెంటనే విడుదల చేయా లని డిమాండ్ చేశారు. నల్లగొండ నియోజక వర్గం శాలిగౌరారం సూ ర్యాపేట తుంగతుర్తి నకిరేకల్లు నియోజకవర్గాలలో మంజూరైన నిధులను వెంటనే విడుదల చే యాలన్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామ ని తెలియజేశారు.అవసరమైతే హైకోర్టులు మెట్లు ఎక్కనున్నట్లు తెలిపారు. నిరుపేద దళితులకు ఆశజూపి ఎన్నికల్లో లబ్ధి పొంది నేడు దళితుల పథకాలు అమలు చేయకపోవడం అన్యాయం అన్నారు. దళితులంతా ఏకమై తగిన సమయంలో పాలకులకు బుద్ధి చెబుతారని తెలియాశారు. దళిత బంద్ సాధన కొరకు దఫ దఫాలుగా ఉద్యమాలు పోరా టాలు నిర్వహిస్తామని తెలి యజేశారు. ఈ కార్యక్రమంలో దళిత బంధు సాధన కమిటీ నాయ కులు అంబేద్కర్ భవన కన్వీనర్ బొర్ర సుధాకర్ దళిత బందు సాధ న కమిటీ నాయకులు కందుల ల క్ష్మయ్య, అవుట రవీందర్ నాయ కులు ఖతర్నాక్, ఆదిమల్ల లింగ య్య, అవుట రవీందర్, పేర్ల అశో క్, పెరిక యాదయ్య, ఈర్ల ప్రసాద్, కందుల రమేష్, కొప్పోలు విమల మ్మ, దర్శనం రాంబాబు, ఆరె కంటి నరసింహ, పేరపాక నరసింహ తది తరులు పాల్గొన్నారు.