Minister Komati Reddy Venkata Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరా బాద్ బోడుప్పల్ కేశవనగర్ కాలనీ లో శ్రీ అన్నపూర్ణ దేవి సహిత విశ్వ నాథస్వామి వారి ప్రతిష్టాపన కార్య క్రమంలో రాష్ట్ర రోడ్లు, భ వనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమ టిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రికి పూర్ణకుంభం, మంగళహారతులతో పూజారులు, కేశవ్ నగర్ కాలనీ ప్రజలు స్వాగ తం పలికారు. శ్రీ అన్నపూర్ణాదేవి సహిత విశ్వనాథ స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయంలో ఏర్పాటు చేసిన హోమంలో పాల్గొ న్న మంత్రి పూజా కార్య క్రమాల అనంతరం మాట్లాడారు.
అరదుగా ఉండే కాశీ విశ్వనాథుని ఆలయా న్ని బోడుప్పల్ ప్రాంతంలో నిర్మించి న ధర్మకర్తలకు, కాలనీ ప్రజలకు నా అభినందనలు తెలియజేశారు. తె లంగాణ రాష్ట్రంలోని ప్రజలంతా సుఖశాంతులతో పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని శ్రీ అన్నపూర్ణ సహిత విశ్వనాథ స్వామి ప్రార్ధించ డం జరిగిందన్నారు. అదే విధంగా వచ్చే 18 నెలల్లో ఉప్పల్ ఘట్ కీ సర్ ఫ్లైఓవర్ పనులను పూర్తి చేసి బోడుప్పల్ ప్రజల ట్రాఫిక్ కష్టాలను తీరుస్తామని హామీ ఇచ్చారు. హైద రాబాదులో నిరుపేదలకు ఇల్లు క ట్టించే కార్యక్రమం చేయక దాదా పు దశాబ్దం గడిచిపోయింది.
ప్రజా ప్రభుత్వంలో నిరుపేదలకు ఇల్లు కట్టించే అందిస్తామని తెలిపారు. ప్రభుత్వం మరెన్నో సంక్షేమ కార్య క్రమాలు అమలు చేసి నిరుపేదల కు అండగా నిలుస్తుందన్నారు. మా ప్రజా ప్రభుత్వ ప్రయత్నానికి ఆ కాశీ విశ్వనాథుని ఆశీస్సులు ఉం డాలని ప్రార్థించడం జరిగింద న్నారు. అద్భుతమైన శిల్పాలతో ఆలయాన్ని నిర్మించిన శిల్పులకు, ఆలయ నిర్మాణానికి పూనుకున్న దాతలకు, ప్రజలకు ఆలయ ప్రతి ష్టాపన సందర్భంగా నా శుభాభి నందనలు అని పేర్కొన్నారు.