Roadaccident : నల్లగొండ జిల్లా కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం
లారీని వెనుకనుంచి ఢీకొట్టిన ట్రక్ -- అక్కడక్కడే డ్రైవర్, క్లీనర్ దుర్మరణం
నల్లగొండ జిల్లా కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం
—లారీని వెనుకనుంచి ఢీకొట్టిన ట్రక్
— అక్కడక్కడే డ్రైవర్, క్లీనర్ దుర్మరణం
Roadaccident : ప్రజా దీవెన, నల్లగొండ క్రైమ్: జిల్లా కేంద్రంలో బుధవారం ఉద యం ఘోర రోడ్డు ప్రమాదం జరి గింది. డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే మృ త్యువాత పడ్డారు. నల్లగొండ టూ టౌన్ ఎస్ఐ నాగరాజు తెలిపిన వివ రాల ప్రకారం ఉత్తరప్రదేశ్ రా ష్ట్రానికి చెందిన చెందిన డీసీఎం ట్రక్ డ్రైవర్ కం ఓనర్ అధ్వేష్ కుమార్ (38), క్లీనర్ రాజీవ్ (36)లు తమి ళనాడు నుంచి, ఢిల్లీకి బయళ్ధేరా రు.
బుధవారం ఉదయం అద్దంకి- నార్కెట్ పల్లి హైవేపై నల్లగొండ జిల్లాకేంద్రంలోని పానగల్ బైపాస్ ఫ్లైవర్ దిగే క్రమం లో, కెమికల్ పౌడర్ లోడుతో వెళు తున్న లారీ డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు. ఈ క్రమంలో వెనుక నుంచి వస్తున్న, ట్రక్ ఒక్కసారిగా ముందు న్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదం లో ఢీకొ ట్టిన డీసీఎం ట్రక్ క్యాబిన్ నుజ్జై డ్రైవర్, క్లీనర్ ఇరుక్కుపోయారు.
స్థానికులు వెంటనే టూ టౌన్ పోలీ సులకు సమాచారం అందించగా, హుటాహుటినా ఘటనాస్థలికి సీఐ రాఘవరావు, ఎస్ఐ నాగరాజు సి బ్బందితో కలిసి వెళ్లి, మృత దేహా లను బయటకు తీయడానికి రెం డు ఘంటలు శ్రమించారు. అయితే ఉ త్తరప్రదేశ్ లో ఉన్న బాధి త కుటుం బీకులకు సమచారం అందించి, మృతదేహాలను ప్రభుత్వా సుపత్రి మార్చురీలో భద్రపరిచినట్లు ఎస్ఐ నాగరాజు తెలిపారు.