Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Mohammad Asraf Khan : బిగ్ బ్రేకింగ్, మోస్ట్ వాంటెడ్ క్రిమిన ల్ మహమ్మద్ అస్రఫ్ ఖాన్ అరెస్ట్

–అంతర్ ర్రాష్ట్ర దొంగల ముఠాథార్ గ్యాంగ్ చెందిన ప్రధాన నిందితుడు

–అరెస్టు చేసి వంద శాతం రికవరీ చేసిన నల్గొండ జిల్లా పోలీస్

–నిందితుడు అష్రఫ్ వద్ద నుండి రూ. 25 లక్షలు, కారు స్వాధీనం

Mohammad Asraf Khan : ప్రజా దీవెన నల్లగొండ: అంతర్ ర్రాష్ట్ర దొంగల ముఠాథార్ గ్యాంగ్ చెందిన ప్రధాన నిందితుడు, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మహమ్మద్ అస్ర ఫ్ ఖాన్ అరెస్ట్ అయ్యారు. నల్ల గొండ జిల్లా నార్కట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రయివేట్ ట్రావెల్ బస్ నుంచి రూ. 25 లక్షలు దొంగ లించి పరారైన ధార్ గ్యాంగ్ చెందిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మహమ్మ ద్ అస్రఫ్ ఖాన్ ను ప్రత్యేక బృందా లు ఏర్పాటు చేసి అరెస్టు చేశారు. ఈ మేరకు నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ గురువారం నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాల యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వివ రాలు వెల్లడించారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెల 9వ తేదీన చెన్నై నుం చి హైదరాబాద్ వెళ్లే శ్యామ్ సర్దార్ ట్రావెలింగ్ బస్సులో ప్రయాణిస్తున్న నెల్లూరుకు చెందిన బోయిన వెంక టేశ్వర్లు హైదరాబాద్ లోని మౌరీ టెక్ సంస్థ యజమాని దామోదర్ రెడ్డి కు సంబంధించి వ్యవసాయ భూమిని అమ్మగా వచ్చిన 25 లక్షల రూపాయలను హైదరాబాద్ తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో బస్ నార్కట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధి లోనీ పూజిత హోటల్ వద్ద ఉద యం 9 గంటలకి టిఫిన్ కోసం ఆప గా కిందికి దిగి మూత్ర విసర్జన చేసి వచ్చేవరకు తన బ్యాగులో ఉన్న 25 లక్షల రూపాయలు గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలిచారని గమనించి స్థానిక నార్కట్ పల్లి పో లీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా ఆ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నార్కట్ పల్లి సిఐ ఆధ్వర్యంలో నాలుగు బృందాలు, సిసియస్ నల్గొండ రెండు బృందాలు కార్యాచరణలోకి దిగి పూజిత హోటల్ నందు సీసీ కెమెరాలు పరిశీలించగా ఒక మా రుతి సుజుకి ఫ్రాంక్స్ వెహికల్ లో నలుగురు వ్యక్తులు వచ్చి ఒక వ్యక్తి బస్సులోకి ఎక్కి బ్యాగును తీసు కొని కిందికి వచ్చి కారులో హైదరా బాదు వైపు వెళ్లినట్లుగా గుర్తిం చారు. ఈ సీసీ కెమెరాల ఆధా రం గా నలుగురు వ్యక్తుల ఫోటోలని గుర్తించి అన్ని క్రైమ్ టీంలకు పంప గా పాత నేరస్థుల ఫొటోలతో సరి పోల్చగా వీరు మద్యేప్రదేశ్ చెందిన థార్ గ్యాంగ్ గా CCS పోలీస్ లు గుర్తించడం, సిసియస్ సీఐ జితేం దర్ రెడ్డి యస్. ఐ వెంకట్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్స్ విష్ణువర్ధనగిరి, రబ్బాని, పుష్పగిరి, సత్యనారా యణ లతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి మధ్యప్రదేశ్ రాష్ట్రా నికి పంపించారు. మధ్యప్రదేశ్ లోని థార్ జిల్లాలో మనవార్ పోలీసు స్టే షన్ పరిధిలో ఒక ప్రధాన నిందితు ని పట్టుబడి చేసి ఇతని వద్ద నుండి 25 లక్షలు రూపాయలు, ఒక కారు, స్వాధీనం చేసుకొని అక్కడి కోర్టు లో ప్రొడ్యూస్ చేయడం ద్వారా నార్కెట్ పల్లి పోలీస్ స్టేషన్ తీసు కువచ్చి విచారించారు.

 

నిందితులు మహమ్మద్ అస్రఫ్ ఖాన్ ముల్తాని ( 42), లైబ్ ఖాన్, అక్రమ్ ఖాన్,
మహబుబ్ ఖాన్ తదితర ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. ఈ మేరకు పైన తెల్పిన నిందితులు విలాసాలకు అలవాటు పడి అక్రమ మార్గం లో డబ్బులు సంపాదించా లని దొంగతనాలు చేయడం మొద లుపెట్టి ఇలా స్వంత రాష్ట్రం లో అనేక దొంగతనాల చేసి జైలుకు వెళ్లడం జరిగింది. స్వంత రాష్ట్రం లో దొంగతనాలు చేస్తూ పోలీసులు ప్రతిసారి పట్టుబడి చేసి జైల్ కు పంపుతుండటం తో అక్కడ కాకుం డా వేరే రాష్ట్రాలలో దొంగతనాలు చేస్తే పోలీసులు పట్టుకోలేరని నిర్ణ యించుకున్నారు.ఇట్టి దొంగతనా లలో భాగంగా హైవే రోడ్ల వెంబటి ప్రయాణిస్తూ రోడ్డు పక్కన ఉండే పెద్ద పెద్ద హోటల్స్ దగ్గర ఆగి అక్క డికి వచ్చే ట్రావెల్స్ బస్ లను గమ నిస్తూ బస్ లోని ప్రయాణికులు టి ఫిన్ చేయడానికి బస్ దిగగానే బ స్సులోకి ఎక్కి దొంగతనాలకు పా ల్పడడం పరిపాటిగా చేసుకు న్నారు.

 

ప్రత్యేక బృందాల ద్వారా మధ్యప్రదేశ్ కు వెళ్లి అక్కడి పోలీస్ అధికారుల సహకారంతో పట్టుబడి చేసి 25 లక్షలు రూపాయలు,ఒక కారు,స్వాధీనం చేసుకొని రావడం ద్వారా కోర్టులో లో హాజరు పరిచామని ఎస్పీ శరత్ చంద్ర పవర్ తెలిపారు. గతంలో నింది తుడు అష్రఫ్‌ పై పూణే (మహా రాష్ట్ర), ఇండోర్ జిల్లాలోని సిమ్రోల్ పోలీస్ స్టేషన్‌లో దొంగతనానికి సం బంధించిన నేరాలు, మనవార్ పోలీస్ స్టేషన్‌లో దాడికి సంబంధిం చిన నేరాలు నమోదయ్యాయి. సుళ్ళూరు పేట,నెల్లూరు జిల్లా ఆం ధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కేసు లు నమోదు అయ్యీయి.ఇంకా పరారి లో ఉన్న ముగ్గురు నిందితులను త్వరలో పట్టుకోవడం జరుగుతుం దన్నారు.నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి పర్యవేక్షణలో ఛేదించిన సి.సి. యస్ సిఐ జితేందర్ రెడ్డి,నార్కట్ పల్లి సిఐ నాగరాజు,యస్.ఐలు క్రాంతి కుమార్, వెంకట్ రెడ్డి CCS హెడ్ కానిస్టేబుల్స్ విష్ణువర్ధనగిరి, రబ్బాని, పుష్పగిరి, కానిస్టేబుల్ సత్యనారాయణ లను జిల్లా ఎస్పి సందర్భంగా అభినందిoచి రివార్డ్ ప్రకటించారు.