Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

SP Sunpreet Singh : పెద్దగట్టులో మల్టీ జోన్ ఐజి సత్యనారాయణ

–పకడ్బందీ బందోబస్తు ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్, పోలీసు లకు అభినందనలు

SP Sunpreet Singh : ప్రజా దీవెన, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా దురాజుపల్లి పెద్ద గట్టు శ్రీ లింగమంతుల స్వామి జాతరను గురువారం సందర్శించా రు. మల్టీ జోన్ 2 ఐజి సత్యనారా యణ జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ తో కలిసి జాతరలో పోలీ సు బందోబస్తును, జాతర సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ జాతరలో ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తు, పార్కింగ్, వాహనాల మళ్లింపు, కమాండ్ కం ట్రోల్స్ సెంటర్, సిబ్బంది భోజనం వసతి, సీసీటీవీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, పోలీస్ కంట్రోల్ రూం, హెల్ప్ లైన్ సెంటర్, క్రైమ్ డైటేక్షన్ టీమ్స్, షీ టీమ్స్ ఏర్పాటు, జాతర సరళి వివిధ అంశాలను ఐజికి వివరించారు. ఈ సందర్భం గా ఐ జి సత్యనారాయణ మాట్లా డుతూ తెలంగాణ రాష్ట్రంలో రెం డవ అతిపెద్ద జాతరైన దురాజ్ పల్లి పెద్దగట్టు జాతరను జిల్లా పోలీస్ శాఖ సమర్థవంతంగా విజయవంతంగా నిర్వహిస్తుం దన్నారు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రక్షణ పరంగా జిల్లా పో లీస్ శాఖ కట్టుదిట్టంగా అన్ని ఏర్పా ట్లు చేసిందని జిల్లా ఎస్పీ, జిల్లా పో లీస్ సిబ్బందిని ఈ సందర్భంగా అభినందిస్తున్నానన్నారు. ఐదు రోజులపాటు జరుగుతున్న ఈ జాతరలో ఎలాంటి దొంగతనాలు జరగకుండా ముందస్తుగా జాగ్రత్త లు తీసుకొని ప్రత్యేక టీమ్స్ ఏర్పా టు చేసి దొంగతనాలు చోటు చేసు కోకుండా నివారించారు. ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల జాతీ య రహదారిపై ఎలాంటి ట్రాఫిక్ జా మ్ అవలేదని తెలిపారు.

వాహనా ల మళ్లింపు వల్ల ఎవరు అసౌకర్యా నికి గురవలేదని అన్నారు.మహిళా భద్రత లో భాగంగా 50 మంది పోలీసు సిబ్బందితో షీ టీం బృందా లు ఏర్పాటు, అనుమానితులను గుర్తించడానికి ప్రత్యేక టీమ్స్ ఏర్పా టు మంచి ఫలితానిచ్చినది అన్నా రు. భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన వాహనాల మళ్లింపులను, ట్రాఫిక్ పాయింట్ లను, క్యూ లైన్ లను భక్తులు, ప్రజలు, వాహనదా రులు సద్వినియోగం చేసుకుని పోలీస్ వారికి సహకరించారని ధన్యవాదాలు తెలిపారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి జాతర నలుదిశలా పరిశీలించారు. అనం తరం దైవదర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఐజి, ఎస్పీలను సన్మానించి పెద్దగట్టు జాతర జ్ఞాపికను అందిం చారు. ఐజి వెంట ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ , ఏ ఆర్ అదనపు ఎస్పీ జనార్ధన్ రెడ్డి, సూర్యాపేట సబ్ డివిజన్ డిఎస్పి రవి, సూర్యా పేట రూరల్ సిఐ రాజశేఖర్, స్పెష ల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నాగభూషణం, సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ వీర రాఘవులు, స్థానిక ఎస్ ఐ మహే శ్వర్, పోలీసు సిబ్బంది ఉన్నారు.