— నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
Collector Tripathi : ప్రజా దీవెన నల్లగొండ: గత సంవత్సరం లాగే ఈ సంవత్స రం సైతం జిల్లాలో తాగునీటికి సమస్యలు రాకుండా చూసుకోవా లని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎంపీడీవోలు, తహసిల్దారులను ఆదేశించారు. గురువారం ఆమె ఉదయాదీత్య భవన్ లో తహ సిల్దారులు, ఎంపీడీవోలతో వేసవి కార్యాచరణ ప్రణాళిక పై సమీక్ష నిర్వహించారు.
ఎక్కడైనా తాగునీటి పైపులు, నల్లాలు తదితర అత్యవసర మరమ్మతులు ఉన్నట్లయితే గ్రామపంచాయతీ నిధుల నుండి చేయించాలని ఆదేశించారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే ప్రైవేటు వ్యవసాయ బోర్లకు అనుమతి ఇవ్వడం జరుగుతుందన్నారు.పట్టణాలు, గ్రామాలలో తాగునీటి సమస్యలు ఉత్పన్నం కాకుండా రూపొందించే వేసవి కార్యాచరణ ప్రణాళికలో స్పష్టమైన రోడ్ మ్యాప్ తయారు చేయాలని, ఎక్కడ సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని , రానున్న 150 రోజులకు ప్రణాళిక రూపొందించాలని చెప్పారు.
అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ మాట్లాడుతూ వేసవి తాగునీటి కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తికి ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం తాగనీటిని ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. ఇందుకు సంబంధించి గ్రామీణ ప్రాంతానికి కార్యాచరణ ప్రణాళికను అధ్యయనం చేయడం జరిగిందని, మిషన్ భగీరథ గ్రిడ్ లో అలాగే నీటి సరఫరా లో ఎలాంటి సమస్యలు లేవని, అలాగే అంతర్గత సరఫరా లో ఉన్న సమస్యలను గుర్తించడం జరిగిందని, ఎక్కడైనా హ్యాండ్ పంపులు, తాగునీటి పైప్ లైన్లు మరమ్మతులు ఉంటే వెంటనే చేపట్టాలని అన్నారు. తాగు నీటి ట్యాంకులను, ఓహెచ్ఎస్ఆర్లను శుభ్రం చేయించాలని, ఎప్పటిక ప్పుడు క్లోరినేషన్ చేయించాలని తాగునీటి ట్యాంకులపై తప్పని సరిగా మూతలు ఉంచాలని తెలి పారు.మిషన్ భగీరథ ఈ ఈ వంశీ కృష్ణ మాట్లాడుతూ వేసవి కార్యా చరణ ప్రణాళికలో భాగంగా చేపట్ట నున్న ప్లాన్ ఏ, బి, సి కార్యక్రమా లపై వివరించారు. నూటికి నూరు శాతం మిషన్ భగీరథ తాగునీరు సరఫరా అయ్యే చోట గ్రామపంచాయతీ మోటార్లను వాడవద్దని తెలిపారు. ప్లాన్ సి కింద ఎక్కడ తాగునీటి ఓనర్లు లేని చోట మాత్రమే వ్యవసాయ బోర్లు లీజుకు టీసుకునేందుకు అవకాశం ఉందన్నారు. గ్రామాలలో తాగు నీటి ట్యాంకులు, పథకాలు, పైపు లైన్లు లీకేజీ వంటి ఉంటే తక్షణమే గుర్తించాలని చెప్పారు. మిర్యాల గూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ తదితరులు ఈ సమావే శానికి హాజరయ్యారు.