Electric Shock: ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలంలోని మర్రి గూడెం గ్రామ సమీపంలో విధి వ oచితమై మేకల కాపరి నిండు ప్రాణాలు బలి తీసుకుంది. మేకల కోసం చెట్టు ఆకులు సమకూర్చేం దుకు ప్రయత్నించిన మేకల కాపరి కరెంటు షాక్ తో మృత్యువాత పడ్డాడు. ఈ హృదయ విదారక సంఘటన శుక్రవారం తిప్పర్తి మండలం మర్రిగూడ గ్రామ సమీ పంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామాని కి చెందిన సింగం భాస్కర్ (48) మేకల కాపరిగా జీవనం కొనసాగి స్తున్నాడు.
మేకల మేత కోసం తుమ్మ చెట్టు ఎక్కి కొమ్మలు కొట్టే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు వి ద్యుత్ తీగలు కిందికి ఉండడంతో విద్యుత్ తీగలు తగిలి షాక్ తో చెట్టు మీదనే ప్రాణాలు వదిలాడు. గత కొద్ది రోజులుగా గ్రామ సమీపం లో ఉన్న విద్యుత్ వైర్లు కిందికి ఉ న్నాయని గ్రామస్తులు చెప్పినప్ప టికీ విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఒక నిండు ప్రాణం బలైందని విద్యుత్ అధికారులపై చర్యలు తీసుకోవాలని మృతుని కుటుం బానికి న్యాయం చేయాలని గ్రామ స్తులు కోరారు.