— నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
Collector Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: మాతా, శిశు మారణాలను తగ్గించడంలో భాగంగా మాతా, శిశు మరణాలు సంభవించడానికి గల కారణాలను విశ్లేషించాలని జిల్లా కలెక్టర్ వైద్యా ధికారులను ఆదేశించారు. శుక్ర వారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాల యంలోని సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికా రులతో నల్గొండ జిల్లా డివిజన్ కు సంబం ధించి మాతా, శిశు మరణా లపై సమీక్ష నిర్వహించారు.జిల్లాలో మా తా, శిశు మరణాలు సంభవిస్తే ఈ విషయాన్ని అందరూ బాధ్యత గా తీసుకోవాలని అన్నారు. ము ఖ్యం గా మాత ,శిశు మరణాలను అరిక ట్టడంలో అంగన్వాడి, ఆశాల ది కీలకపాత్ర అని చెప్పారు. అనా రో గ్యం కారణంగా మరణాలు సంభ వించినప్పుడు వైద్యులు, నర్సులు, మెడికల్ సహాయం అవసరం అవు తుందని, అయితే అవగాహన లో పం , పౌష్టికాహార లోపం, నిర్లక్ష్యం వంటి కారణాలవల్ల మాత , శిశు మరణాలు సంభవిస్తే సరైన విధం గా వారికి అవగాహన కల్పించకపో వడం వల్లనే మరణాలు సంభవిస్తు న్నాయని అర్థం వస్తుందని తెలిపా రు. ఈ విషయంలో అంగన్వాడీ, ఆ శలు కీలక పాత్ర పోషించాలని కోరా రు.
దేవరకొండ ప్రాజెక్టుపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలని, సిడి పివో లు ప్రతినెల ఆశా, అంగన్వాడీ ల తో సమావేశాలు నిర్వహించి గర్భి ణీ స్త్రీలకు అన్ని విషయాల పట్ల కౌన్సిలింగ్ ఇవ్వాలని, ప్రత్యే కించి వైద్య పరీక్షలు, పౌష్టికాహారం, తీసు కోవాల్సిన ఇతర జాగ్రత్తలపై తెలి యజేయాలని, మహిళ గర్భం దా ల్చినప్పటి నుండి ప్రసవం వరకు, అలాగే ప్రసవం అయిన తర్వాత బిడ్డకు పాలు పట్టడం వరకు ఏం చేయాలో స్పష్టంగా తెలియజేయా లి అన్నారు. ఇకపై ఎక్కడైనా మా త శిశు మరణాలు సంభవిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అందు వల్ల అంగన్వాడీలు, ఆశలు, డాక్ట ర్లు అందరూ జాగ్రత్తగా ఉండాల న్నారు.మాత ,శిశు మరణాల కార ణాలపై విశ్లేషణ చేయాలని, మహి ళలు గర్భం దాల్చిన వెంటనే ఆశా లు ప్రతిరోజు వారి ఇంటికి వెళ్లి గ మనించాలని తెలిపారు .కొన్ని మ రణాలు మేనరికం, మూఢనమ్మ కాలు, పౌష్టికాహారం తీసుకోకపోవ డం వంటి కారణాలవల్ల జరుగుతు న్నాయని, ఇలాంటి విషయాలలో తల్లిదండ్రులకు, గర్భిణీ స్త్రీలకు పూర్తిస్థాయిలో కౌన్సిలింగ్ చేయా ల్సిన బాధ్యత అంగన్వాడీ, ఆశాల తో ఆశాలపై ఉందని అన్నారు. ఎక్కడైనా మాతా, శిశు మరణాలు సంభవించిన చోట చనిపోవడానికి గల కారణాలను విశ్లేషిస్తే ఒకవేళ సరైన విధంగా వైద్యం అందించి సకాలంలో వారికి కౌన్సిలింగ్ చేసిన ట్లయితే బతికేందుకు గల అవకా శాలను బేరిజు వేసుకొని ఇకపై మా త, శిశు మరణాలు సంభవించకుం డా చూడాల్సిన బాధ్యత ఉందని అన్నారు.
కౌన్సెలింగ్ ద్వారా 80% మరణాలను అరికట్టవచ్చని చె ప్పారు. పౌష్టికాహారం లోపం లేకుం డా అవగాహన కల్పించాలని, మ హిళా గర్భం దాల్చక ముందు నుం డే మల్టీ విటమిన్ టాబ్లెట్లు విని యోగించే విధంగా చూడాలని తెలి పారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కట్టంగూరు, లైన్ వాడ , కేతపల్లి, చిట్యాల, కనగల్ , రాము లబండ, మాన్యం చెలుక ,తదితర ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల పరిధిలో గత సంవత్సరం జనవరి నుండి ఇప్పటివరకు సంభవించిన మరణా లపై సమీక్ష నిర్వహించారు. జిల్లా లో మాతా శిశు మరణాలు సంభ వించకుండా ప్రతి ఒక్కరు సమన్వ యంతో కృషిచేసి చేయా లని ఆమె పిలుపునిచ్చారు. జిల్లా వైద్య ఆరో గ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీని వాస్ ,జిల్లా సంక్షేమ అధికారిణి కృష్ణవేణి, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ వేణుగోపాల్ రెడ్డి, డాక్టర్ వంద న ,డాక్టర్ స్వరూప రాణి, డాక్టర్ కల్యాణ చక్రవర్తి, వైద్యాధి కారులు, సిడిపిఓలు,ఆశ, అంగ న్వాడీ తది తరులు ఈ సమావేశానికి హాజర య్యారు.