Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Collector Tripathi : ఫుడ్ సేఫ్టీ అధికారులు తరచూ దా డులు నిర్వహించాలి

— నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

Collector Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: హోటల్లు, రెస్టారెంట్లు, మాల్స్, చి న్న చిన్న బడ్డీ కోట్లు తదితర ప్రదేశా లలో కల్తీ ఆహార పదార్థాల వల్ల ప్ర జలు అనారోగ్యానికి గురి కాకుండా ఫుడ్ సేఫ్టీ అధికారులు తరచూ దా డు లు నిర్వహించాలని జిల్లా కలెక్ట ర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. శుక్ర వారం జిల్లా కలెక్టర్ చాంబర్ లో ని ర్వహించిన జిల్లా స్థాయి ఆహార భద్రత సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చికెన్ విషయంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఫుడ్ సేఫ్టీ అధికారులు, పశుసంవర్ధక శాఖ అధికారులతో కలిసి సంయుక్తంగా పనిచేయాలని అన్నారు .ఎక్కడైనా రెస్టారెంట్లు, హోటల్లు బడ్డీ కోట్లు, తోపుడు బండ్లు వారు వాడిన నూనెలను తిరిగి వాడడం ,అలాగే కాలపరిమితి ముగిసిన ఆహార పదార్థాలను వాడటం వంటివి చేయకుండా తరచూ దాడులు నిర్వహించాలని, ఎవరైనా అలాంటి వాటికి పాల్పడితే సీజ్ చేయడమే కాకుండా, కేసులు నమోదు చేయాలని చెప్పారు. ఈ విషయంపై ఫుడ్ సేఫ్టీ జోనల్ అధికారి జ్యోతిర్మయి మాట్లాడుతూ ఇప్పటివరకు అభద్రత ఆహార పదార్థాలను వినియోగించినందుకుగాను నల్గొండ జిల్లాలో 16 కేసులు నమోదు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.


జిల్లాలో కేజీబీవీలు, అంగన్వాడీలు జిజిహెచ్ తదితర సంస్థల్లో పెద్ద ఎత్తున విద్యార్థులకు, పేషెంట్లకు భోజనం సరఫరా చేస్తున్నారని అప్పుడప్పుడు వీటన్నిటిని తనిఖీ చేయాలని, అలాగే హాస్టల్లు ఇతర భోజనం సరఫరా చేసే అన్ని చోట్ల తనిఖీలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చెప్పారు .ఇకపై తరచు ఫుడ్ సేఫ్టీ మీటింగ్ లు నిర్వహించి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని, ఎవరైనా కల్తీ ఆహార సరుకులు , ఆహారాన్ని అమ్మిన కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజలలో అలాంటి వస్తువులు వాడకుండా పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని, మరొకరు అలాంటి వాటికి పాల్పడకుండా పెద్ద ఎత్తున ప్రచారం కల్పించాలని ఆమె ఆదేశించారు.జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి స్వాతి, జిల్లా పౌరసర ఫరాల అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ కోటేశ్వరరావు, వ్యవసాయ శాఖ జెడి శ్రావణ్, డిఈఓ బిక్షపతి, ఎస్బి డీఎస్పీ రమేష్, డాక్టర్ కళ్యాణ చక్రవర్తి, తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.