Training volunteers : ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) మరియు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లాలో మొదటి విడతగా 10-2-2025 నుండి 21-2-25 వరకు 12 రోజుల్లో 100 మందికి ఆపదమిత్ర వాలంటీర్లకు శిక్షణ కార్యక్రమం జిల్లా గ్రామీణ సంస్థ నల్లగొండ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. 12 రోజులు ఇట్టి శిక్షణ కార్యక్రమంలో ఎన్డీఆర్ఎఫ్ అధికారులు, జిల్లా ఫైర్, అటవీ, వైద్య రెవిన్యూ, పోలీసు, పంచాయతీరాజ్, మృత్య శాఖ, వివిధ ఇంజనీరింగ్ శాఖల అధికారులు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఇట్టి శిక్షణలో మంటలు, వరదలు, భూకంపాలు మొదలు విపత్తులు నిర్వహణ, ప్రతిస్పందన తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రాణాపాయస్థితిలో ఉన్న వారికి రక్షించడం, ప్రధమశికిత్స చేయడం వివిధ శాఖలతో సమన్వయం చేసుకోవడం మొదలు అంశాలపై అవగాహన కల్పించడం జరిగింది.శిక్షణ లో భాగంగా రెండు రోజులు రెండు గ్రూపులలో (నాలుగు గ్రామాలు) కనగల్, పర్వతగిరి, మునుగోడు, పులిపలుపుల గ్రామాల సందర్శన చేయించడం మరియు పానగలు ఉదయ సముద్రంలో ఫైర్ ముత్యశాఖ ఆధ్వర్యంలో చెరువుల్లో చిక్కుకున్న వారిని రక్షించడం, ప్రాక్టికల్ గా శిక్షణ ఇవ్వడం జరిగింది. శిక్షణతో పాటు ఆపదమిత్ర వాలంటీర్లు అందరికీ ప్రతిరోజు హార్ట్ఫుల్ నెస్ మెడిటేషన్ పై,
శ్రీ రామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించడం జరిగింది. ఇట్టి శిక్షణ కార్యక్రమం జిల్లాలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో, వై. శేఖర్ రెడ్డి జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి/ ఆపద మిత్ర నోడల్ అధికారి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ప్రాంతీయ శిక్షణ మేనేజర్ డాక్టర్ ఎంసీఆర్ హెచ్ఆర్డిఐటి పి.వెంకటేశ్వర్లు శిక్షణ సమన్వయకర్తగా నిర్వహించారు. శిక్షణ ముగింపు రోజైన తేదీ 21-02-25 రోజున శిక్షణ పొందిన ఆపదమిత్ర వాలంటీర్లు అందరికీ ఐడి కార్డులు, సర్టిఫికెట్లు డిఆర్డిఓ చేతుల మీదుగా బహుకరించినారు. ముగింపు కార్యక్రమంలో డిఆర్డిఏ డిపిఎం మోహన్ రెడ్డి, ఏపిఎo ప్రభాకర్, డి.పి. ట్రైనర్ విష్ణువర్ధన్, జయ,వెంకన్న, జెఆర్పిలు తదితరులు పాల్గొన్నారు.