Money Wise : ప్రజా దీవెన, శాలిగౌరారం ఫిబ్రవరి 22: బ్యాంక్ లో ఖాతా ఉన్న ప్రతి ఒక్కరు భీమా చేసుకొని ధీమాగా ఉండాలని ధాన్ ఫౌండేషన్ సెంటర్ ఫర్ ఫైనాన్సియల్ కో ఆర్డినేటర్ ప్రవీణ్ కుమార్ అన్నారు. శాలిగౌరారం మండలం పెర్కకొండారం గ్రామంలో ఆర్ బి ఐ, ధాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ గ్రామీణా బ్యాంక్ ఉచిత ఖాతాదారులకు బీమా పై ప్రత్యేక క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బ్యాంక్ ఖాతా లేని వారు ఉచితంగా ఖాతా తీసుకొని బీమా చేసుకొని ధీమా ఉండాలన్నారు.బ్యాంక్ సేవలపై, ఇన్సూరెన్స్ పై ప్రజలకు అవగాహనా కలిపించారు.
ఈ కార్యక్రమం లో గ్రామీణా బ్యాంక్ మిత్ర వేముల ఆంజనేయులు,సి ఎఫ్ ఎల్ అసోసియేట్ పలస భూపాల్, విబికె వేముల శైలజ, మాచర్ల కృష్ణ, పెరుమాళ్ళ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.అనంతరం ప్రజలకు ఫ్రూటీ జ్యూస్, బిస్కెట్ లు పంపిణి చేశారు.