CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: నాగ ర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట సమీ పంలోని ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో జరిగిన ప్రమాద ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమం త్రి ఎ. రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి ఆరా తీశారు. ముఖ్యమంత్రి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రధానమంత్రి తెలియజేశారు.
సొరంగంలో ఎనిమిది మంది కార్మి కులు చిక్కుకున్నారని, వారిని కా పాడేందుకు అవసరమైన సహా యక చర్యలు చేపట్టామని ప్రధాని కి వివరించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని ప్రధానమంత్రికి చెప్పారు.సహాయక చర్యల కోసం వెంటనే ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాన్ని పంపిస్తామని మోదీ ముఖ్యమంత్రి కి తెలిపారు.
పూర్తిస్థాయి సహకా రం అందించేందుకు కేంద్ర ప్రభు త్వం సిద్ధంగా ఉందని ప్రధానమం త్రి హామీ ఇచ్చారు.ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి వెంటనే మంత్రులను, అధికారు లను అప్రమత్తం చేశారు. ఉదయం నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు తో పాటు డీఐజీ, నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులను హుటా హుటిన ప్రమాదస్థలికి పంపిం చారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానిక అధికారులు, ఎస్‌డీఆర్ఎఫ్, ఎన్ఆర్డీఎఫ్ బృందాలతో పాటు ఇ తర సహాయక చర్యలను పర్యవే క్షిస్తున్నారు.