CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్:ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఘటన స్థలాన్ని సం దర్శించి వచ్చిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సాగునీటి పారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను ముఖ్యమంత్రి కి తెలియజేశారు. ఈ సమీక్ష సమావే శంలో సీఎం సలహాదారు వేం నరేం దర్ రెడ్డితో పాటు ఇతర ఉన్నతాధి కారులు ఉన్నారు.సొరంగంలో చి క్కుకున్న 8 మంది కార్మికులను కా పాడేందుకు సహాయక చర్యల్లో మరింత వేగం పెంచాలని .
ఈ సం దర్భంగా ముఖ్యమంత్రి సూచిం చారు. గాయపడ్డ వారి పరిస్థితిని ఆరా తీశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సాయం అందిం చాలని చెప్పారు. బాధిత కుటుం బాలకు ప్రభుత్వం అండగా ఉం టుందని భరోసా కల్పించాలని చెప్పారు.ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆ ర్ఎఫ్ బృందాలు ప్రమాద స్థలికి చేరుకోనున్నాయని మంత్రి వివ రించారు. సహాయక చర్యల విష యంలో అన్ని విభాగాల అధి కారులు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చెప్పారు.