Mahatma Gandhi University : ప్రజాదీవెన, నల్గొండ : మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ లో మొన్న వెలువడిన యూజీసీ నెట్ ఫలితాలలో నలుగురు విద్యార్థులు యూజీసీ నెట్ సాధించడం జరిగింది. ఇంకొక నలుగురు ప్రవేశం పొందడానికి అర్హత సాధించడం జరిగింది. ఇందులో లింగరాజు మహేష్ కుమార్, చిరుమర్తి కే అనిల్ కుమార్ లు యూజీసీ నెట్ సాధించారు. పృథ్వి, నవ్య, మల్లేష్ రమ్య వీరు పిహెచ్డి లో ప్రవేశం పొందడానికి అర్హత సాధించారు. నవ్య పృద్వి మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో చదివిన దంపతులు కావడం విశేషం.
వీరందరిని విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కాజా అల్తా హుస్సేన్, రిజిస్టర్ ఆచార్య అల్వాల రవి ఆర్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ తెలుగు శాఖ అధ్యాపకులు డాక్టర్ ఆనంద్ నరసింహ, డాక్టర్ సత్యనారాయణ రెడ్డి అనిత కుమారులు అభినందించడం జరిగింది.