ఘోర విషాదం, శివరాత్రి వేళ తెల్లారిన బతుకులు
ShivarathriTragedy: ప్రజా దీవెన, తూర్పుగోదావరి: తూర్పుగోదావరి జిల్లాలో ఘోర విషా దం చోటుచేసుకుంది. మహా శివరాత్రి వేడుకల్లో అపశృతి జరి గింది. గోదావరి స్నానాలకు వెళ్లి ఐదుగురు గల్లంతయ్యారు. ఇందులో ఒకరి మృతదేహం లభ్యమ యింది. శివరాత్రి సందర్భంగా పుణ్యస్నానాలు చేయడానికి గోదావరి నదిలో స్నానం చేయడా నికి ఐదుగురు యువ కులు దిగి గల్లంతయ్యారు.
తూర్పు గోదావరి జిల్లాలోని తాళ్లపూడి మండలం తారిపూడి వద్ద ఈ ఘటన జరిగింది. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు అ క్క డకు చేరుకుని సహా యక చర్యలు ప్రారంభించారు. గల్లం తయిన యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతయిన ఐదు గురు ఎక్కడి వారన్నది మాత్రం ఇంకా తెలి యరాలేదు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ప్రాథమిక సమాచార మేరకు గల్లంతైన వారు వీరే … శివరాత్రి విషా దం సంఘటనలో గల్లంతైన ఐదుగురు యువకులు వివరాలు. తిరు మల శెట్టి పవన్ (20), పడాల దుర్గాప్రసాద్ ( 19), అనిశెట్టి పవన్ (19), గర్రె ఆకాష్ ( 19), పడాల సాయి (19) గా గుర్తించారు.