Science Day : ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : నాగార్జున ప్రభుత్వ కళాశాలలో శుక్రవారం రసాయన శాస్త్రం, భౌతికశాస్త్రం, వృక్షశాస్త్రం విభాగాల ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా ముఖ్యవక్తలుగా పాల్గొన్న మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఆచార్యులు డా. డి. రమేష్ మరియు డా. సిహెచ్ రమేష్ లు మాట్లాడుతూ సైన్స్ అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందినట్లేనని అన్నారు. భారతదేశం ఇప్పటికే పునరుత్పాదక శక్తి రంగంలో ప్రపంచంలోనే నాలుగవస్థానంలో ఉందని ఇంకా అభివృద్ది చెందాలని అన్నారు. ఇందుకోసం. విద్యార్థులు పునరుత్పాదక శక్తి రంగంలో పరిశోధనలపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు సోషల్ మీడియా మీద దృష్టి పెట్టి విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దని సూచించారు.
అనంతరం వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో పోస్టర్ మేకింగ్ కాంపిటిషన్స్ (చిత్ర ప్రదర్శన పోటీలు) నిర్వహించి విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డా. పరంగి రవికుమార్, రసాయన శాస్త్ర విభాగం అధ్యక్షులు డా. అంతటి శ్రీనివాస్, భౌతికశాస్త్రం విభాగం అధ్యక్షులు డా. శ్రీనివాస్ రెడ్డి, వృక్షశాస్త్ర విభాగం అధ్యక్షులు కె. శివరాణి, ఇతర అధ్యాపకులు వెంకటరెడ్డి, వెంకటేశ్వర్లు, బి. అనిల్ కుమార్, ఎం. అనిల్ కుమార్, మహేశ్వరి, శిరీష, సిద్దేశ్,
కృష్ణ తదితరులు పాల్గొన్నారు.