— tuwj 143 నల్లగొండ జిల్లా అధ్యక్షుడు గుండగోని జయశంకర్ గౌడ్
TuwjPresidentGundagoniJayashankar : ప్రజా దీవెన గట్టుప్పల్: నల్లగొండ జిల్లాలోని జర్నలిస్టుల హక్కులు ప్రయోజనాలు కాపాడేందుకు శా యశక్తులా కృషి చేస్తానని tuwj 143 నల్లగొండ జిల్లా అధ్యక్షుడు గుండగోని జయశంకర్ గౌడ్ పేర్కొన్నారు. జర్నలిస్టు లకు ప్రయోజనం చేకూర్చే అక్రిడేషన్ కార్డుల విషయంలో కుట్రలు, కుయుక్తులతో కోతలు విధించేందుకు కసరత్తు జరుగుతున్నట్టు తమ దృష్టికి వ చ్చిoదని గుర్తు చేశారు. శుక్రవారం మునుగోడు నియోజక వర్గం tuwj విస్తృతస్థాయి సమావేశo గట్టుప్పల్ లోని రైతు వేదిక లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐజేయు జాతీయ కార్యవర్గ సభ్యు డు వారి భాస్కర్ తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టియుడబ్ల్యూజే రాష్ట్ర అధ్య క్షులు, మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ సార్ దూరదృష్టి, విశాల హృదయంతో జర్నలిస్టుల ప్రయోజనా ల దృష్ట్యా పని విభజన ఆధారంగా ఆయన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డు లు జారీ చేయడం జరిగిం ద న్నారు. జర్నలిస్టులకు ఎవరైనా అ న్యాయం తలపెట్టే ప్రయత్నాలు సా గుతున్నట్లు ప్రచారం జరుగుతు న్నందున జర్నలిస్టులు ఉద్యమా లకు సన్నద్ధం కావాలని పిలుపు నిచ్చారు.
జర్నలిస్టులకు అన్యాయం జరిగే ఎలాంటి ప్రయత్నాలనైనా తిప్పికొ ట్టేందుకు ప్రభుత్వాన్ని నిలదీస్తామని హామీ ఇచ్చారు. జర్నలిస్టుల హక్కులకు భంగం కలగ కుండా ప్రత్యక్ష పోరాటాలకు టియుడ బ్ల్యూ జే హెచ్143 జిల్లా కమిటీ సన్నద్ధంగా ఉంటుందని, ప్రత్యక్ష పోరాటా లకు మండల నియోజకవర్గస్థాయి జర్నలిస్టులందరూ ఐక మత్యం తో కలిసి రావాలని పిలుపునిచ్చారు. టీయూడబ్ల్యూజే పక్కా ట్రేడ్ యూనియన్ కార్మిక సంఘమని, ఏ ఒక్క పార్టీకి వ్యతిరేకం, అనుకూ లం కాదని, ఏ ప్రభుత్వం ఉన్నా జర్నలిస్టుల హక్కులకు భంగం కల గకుండా, వారి సంక్షేమం కోసం మాత్రమే పనిచేస్తుందని ఆయన వెల్లడించారు. ఐజేయు జాతీయ కౌన్సిల్ మెంబర్ అవ్వారి భాస్కర్ తెలంగా ణలో గడిచిన పదేళ్ళ కాలంలో అధికారంలో ఉన్న ప్రభు త్వంతో స్నేహపూర్వక వాతావరణం లో జర్నలిస్టులకు అవసరమైన అనేక హక్కులను సాధించుకోవడం జరి గిందని, జర్నలిస్టుల సం క్షేమం కోసం నిధిని సమకూర్చుకొని కరోనా సమయంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు అండగా నిలిచి ఒక్కొక్క కుటుంబానికి రెండు లక్షల రూపాయలు సహాయం అందించడంతో పాటు వారి పిల్లల విద్యా భివృద్ధి కోసం కృషి చేయడం జరిగిందని వివరించారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులందరికీ అండగా నిలిచిన ఘన త టీయూడబ్ల్యూజెదే అన్నారు. జర్నలిస్టుల యూనియన్ ను పటిష్ట వంతం చేయడానికి మండల స్థాయి నుం డి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముమ్మరం చేస్తే వారం రోజుల్లోగా సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి యూనియ న్ గుర్తింపు కార్డులు జారీ చేస్తామని తెలి పారు. మునుగోడు నియోజకవర్గంలోని చండూ రు, నాంపల్లి, మర్రి గూడెం, గట్టుప్పల్, మునుగోడు మండల నూతన కమిటీలను వెంట నే సమన్వయంతో ఏర్పాటు చేయాలని కోరారు. సభ్యత్వం ఉన్నవా రికి మాత్రమే కమిటీలలో చోటు కల్పించాలని సూచించారు. జర్నలి స్టుల విస్తృతస్థాయి సమావేశానికి కార్యక్రమానికి హాజరై జర్నలి స్టు లను ఉద్దేశించి మాట్లాడారు. సీనియర్ జర్నలిస్ట్ గాలెంక గురు పా దం మాట్లాడుతూ జర్నలిస్టుల కు పైసా ఆదాయం ఐక్యతతో మెలగ డం లేదని, ఐక్యత లోపిస్తే జర్నలిస్టుల ఉనికి ప్రమాదంలో పడుతుం దని ఆయన హెచ్చరించారు.
ఇటీవల జిల్లా టీయూ డబ్ల్యూ జే జిల్లా ఉపాధ్యక్షులుగా నియ మితు లైన పోలగోని లక్ష్మీకాంత్ గౌడ్ ను సమావేశం ఘనంగా స న్మానించిం ది. అనంతరం ఈ సంద ర్భంగా మునుగోడు నియోజకవర్గ టీయూ డబ్ల్యూజే -143 నూతన కమిటీకి అధ్యక్షులుగా బొడ్డుపల్లి సతీష్ ( tv5) , నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా కోడి రాములు ( మన తె లంగాణ) ను సమావేశం ఏకగ్రీ వంగా ఎన్నుకుంది. నియోజక వర్గ ఉపాధ్యక్షులుగా కామిశెట్టి యాద య్యను ఎన్నుకున్నారు. త్వరలో పూర్తిస్థాయి కమిటీని ప్రకటిస్తామని నూతన అధ్యక్ష, కార్యదర్శులు బొడ్డుపల్లి సతీష్, కోడి రాములు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎల క్ట్రానిక్ మీడియా జిల్లా ప్రధాన కా ర్యదర్శి సల్వాది జానయ్య, జిల్లా కమిటీ నాయకులు వీరస్వామి, నరసింహ గౌడ్, సైదులు, ఎం గాల య్య, శ్రీశైలం, రామస్వామి, జి వి నోద్ కుమార్ తదితరులు పాల్గొ న్నారు.