Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Achchennaidu : మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యా ఖ్య, అభివృద్ధికి వ్యవసాయమే ఆ ధారం

Achchennaidu : ప్రజా దీవెన, అమరావతి: ఆంధప్ర దేశ్‌ ప్రభుత్వం శుక్రవారం నాడు అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్‌ ప్రవే శపెట్టింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు దీనిని స భలో ప్రవేశపెట్టారు. ఇందులో రై తులకు శుభవార్త చెప్పారు. మొ త్తం రూ. 48,340 కోట్లతో వ్యవ సాయ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఆయా రంగాలకు భారీగా కేటాయింపులు చేసింది. వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.13,487 కోట్లు కేటాయించారు. దేశం, రాష్ట్రం అభివృద్ధికి వ్యవసాయమే ఆధారమని మంత్రి అచ్చెన్న పేర్కొన్నారు. వికసిత్‌ భారత్‌కు అనుసం ధానంగా ఏపీ పురోభివృద్ధి ఉంటుందన్నారు. సాంకేతికతతో సాగు ఖర్చులు తగ్గించాలనేదే లక్ష్యంగా చెప్పారు. దేశం, రాష్ట్రం అభివృద్ధికి దోహదపడేది వ్యవసాయ రంగమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.ప్రధాన వనరైన వ్యవసాయాన్ని ప్రాథమిక రంగంగా గుర్తించామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. రైతులను స్థితిమంతులుగా చూడాలని ఆకాంక్షిస్తూ స్వర్ణాంధ్ర`2047 లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. వికసిత్‌ భారత్‌ 2047కు అనుసంధానంగా ఏపీని ప్రగతిపథంలో ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. 2047 నాటికి 2.4 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్టాన్న్రి మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి వెల్లడిరచారు.గత ప్రభుత్వం బకాయి పెట్టిన రూ.120 కోట్ల విత్తన రాయితీ చెల్లించామని అసెంబ్లీ వేదికగా మంత్రి ప్రకటించారు. 35.8 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువు సరఫరా చేశామన్నారు. వ్యవసాయ రంగంలో తొలిసారి డ్రోన్‌ల వినియోగం చేపట్టామని మంత్రి అచ్చెన్న తెలిపారు. ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. భూమి ఉన్న రైతుకు గుర్తింపు సంఖ్య ఇస్తున్నామని.. అర్హులైన కౌలు రైతులకు హక్కు కార్డులు మంజూరు చేస్తామని మంత్రి చెప్పారు. ఎరువులు, ప్రకృతి వ్యవసాయం, వ్యవసాయ యంత్రాల రాయితీ, డ్రోన్ల రాయితీకి సంబంధించి భారీగా కేటాయింపులు జరిపారు.

ఈ కేటాయింపుల వల్ల రైతులకు భారీగా మేలు చేకూరనుంది.వ్యవసాయ బడ్జెట్లో గ్రోత్‌ ఇంజిన్లుగా 11 పంటలను ప్రభుత్వం పేర్కొంది.ఎరువుల స్టాక్‌ నిర్వహణకు రూ.40 కోట్లు,ప్రకృతి వ్యవసాయం ప్రోత్సాహానికి రూ.61 కోట్లు,వ్యవసాయ యంత్రాల రాయితీకి రూ.139 కోట్లు, 7.78 లక్షల క్వింటాళ్ల విత్తనాలు పంపిణీ చేశామని అన్నారు. అలాగే డ్రోన్ల రాయితీ కోసం రూ.80 కోట్లు,875 కిసాన్‌ డ్రోన్‌ వ్యవసాయ యాంత్రీకరణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. వ్యవసాయ యాంత్రీకరణకు రూ.219 కోట్లు, విత్తన రాయితీ పంపిణీకి రూ.240 కోట్లు. రైతులకు వడ్డీలేని రుణాల కింద రూ.250 కోట్లు., అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్‌ అమలుకు రూ.9,400 కోట్లు., ఉచిత పంటల బీమా కోసం రూ.1,023 కోట్లు., వ్యవసాయ శాఖకు రూ.12,401 కోట్లు., ఉద్యాన శాఖకు రూ.930.88 కోట్లు., పట్టుపరిశ్రమకు రూ.96.22 కోట్లు,సహకారశాఖకు రూ.239.85 కోట్లు.

పశుసంవర్థక శాఖకు రూ.1,112.07 కోట్లు.,మత్స్య రంగానికి రూ. 540.9 కోట్లు కేటాయించారు. వ్యవసాయ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రసంగం చేశారు.ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్‌ బడ్జెట్‌ ప్రసంగం ముగిసిన వెంటనే.. శాసనసభలో వ్యవసాయ బడ్జెట్‌ ను ఆ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశ పెట్టారు.. ప్రకృతి వ్యవసాయం పై దృష్టి పెట్టాం.. ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం పై కూటమి సర్కార్‌ ఫోకస్‌ పెట్టిందన్నారు.. వ్యవసాయం ప్రాథమిక రంగంగా గుర్తింపు ఉంది.. రాష్ట్రంలో భూమి కలిగిన వారికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇవ్వనున్నట్టు వెల్లడిo చారు.. ఇక, శాసనమండలిలో వ్యవసాయ బడ్జెట్‌ 2025`26 ను మంత్రి నారాయణ ప్రవేశపెట్టారు.