— నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
NalgondaCollector : ప్రజా దీవెన, చండూరు: ఈ వేసవిలో తాగునీటికి ఎలాంటి కొరత రాకుండా చర్యలు తీసుకో వాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆమె చండూరు ముని సిపల్ కార్యాలయంలో చం డూరు మున్సిపాలిటీ చండూరు గ్రామీణ ప్రాంతంలో తాగునీటి సర ఫరాపై సమీక్ష నిర్వ హించారు. చండూరు మున్సిపాలిటీతో పాటు, గ్రామపం చాయతీ లలో జనాభా ఆధారంగా తాగునీటిని ఇవ్వా లని ,ఎక్కడైనా మిషన్ భగీరథ తాగునీటి వనరు లు, బోర్లు చెడిపోయిన,మైనర్ రిపేర్లు ఉన్నట్లయితే గుర్తించి వాటి మరమ్మతులకు కార్యాచరణ ప్రణాళిక సమర్పించాలని, అలాగే పైపు లైన్ లీకేజీలను అరికట్టి తా గునీర్వాల్సిందిగా ఆదేశించారు.
మిషన్ భగీరథ త్రాగునీటిని కేవలం తాగేందుకు మాత్రమే వినియో గించుకోవాలని, పశు వులు, ఇండ్లు, కార్లు వంటి వాటిని శుభ్రం చేసుకునేందుకు, ఇతర అవసరాలకు మిషన్ భగీరథ తాగునీటిని వాడవద్దని ప్రజలకు అవగాహన కల్పించాలని ఆమె తెలిపారు. తాగునీటి విషయంలో అధికారులు, సిబ్బంది ఆలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటా మని ఆమె హెచ్చరించారు.
ఈ వేస విలో ప్రజలు తాగునీటికి ఇబ్బం దులకు గురి కాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు.అనంతరం మున్సిపల్ పరిధిలో 9వ వార్డులో ఉన్న జిఎస్ఎల్ ఆర్ ను పరిశీలించారు. అలాగే ఏడవ వార్డులో నిర్మాణంలో ఉన్న ఓహెచ్ఎస్ఆర్ ను తనిఖీ చేశారు. అధనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, చండూరు ఆర్డీవో శ్రీదేవి, మున్సిపల్ కమిషనర్ మునావర్ అలీ, పబ్లిక్ హెల్త్ డి ఈ మనో హర ,ఆర్డబ్ల్యూఎస్ ఏఈ పూజిత, పంచాయతీరాజ్ ఈ ఈ , ఎంపీ డీవో రామిరెడ్డి తదితరులు ఉ న్నారు.