Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

BIG Breaking: పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా గంజాయి పట్టివేత

BIG Breaking: ప్రజా దీవెన, చౌటుప్పల్ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండ ల పరిధిలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీ స్థాయిలో గంజాయి ప ట్టుబడింది. చౌటుప్పల్ పోలీసుల ఆధ్వర్యంలో వాహనాలను తనిఖీ చేస్తున్న క్రమంలో 51 ప్యాకెట్లలో 102 కిలోల గంజాయిని మారుతి స్విఫ్ట్ డిజైర్ కారులో అక్రమంగా తరలిస్తున్న విషయాన్ని గుర్తించి పోలీసులు పట్టుకొని నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.దీనిపై పై ఏసీపీ కార్యాలయంలో ఆది వారం నిర్వహించిన విలేకరుల స మావేశంలో గంజాయి అక్రమ రవా ణా వివరాలను వెల్లడించారు.

డిసి పి తెలిపిన వివరాల ప్రకారం మహా రాష్ట్రలోని బీడు పట్టణానికి చెంది న నకుల్ కైలాస్ గైకావాడ్ గత ఐ దు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం అటవీ ప్రాంతం నుండి కారులో గంజాయి ని అక్రమంగా మహారాష్ట్రకు తర లించి అమ్మేవాడని, మొదట్లో ప్ర మోద్, సచిన్ మన వ్యక్తులతో క లిసి వ్యాపారం చేసేవాడని, వారితో విభేదాలు రావడంతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సేటు అనే వ్యక్తి తో కలిసి వ్యాపారం కొనసాగిస్తు న్నాడని, అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారాం జిల్లా నర్సీపట్నం గ్రామా నికి చెందిన వీరబాబు ద్వారా గం జాయిని కొనుగోలు చేసి కారులో నెంబర్ ప్లేట్లు మారుస్తూ మహారా ష్ట్రకు వెళ్లి అమ్మేవాడన్నారు.

గం జాయి వ్యాపారంలో భాగంగా ఈనె ల 1వ తేదీన ఆంధ్ర ప్రాంతంలోని అనకాపల్లి జిల్లా కన్నూరు గ్రామాని కి వెల్లగా ముందుగా చేసుకున్న ఒ ప్పందం మేరకు వీరబాబు102 కి లోల గంజాయిని 51 ప్యాకెట్లుగా తయారుచేసి పెట్టగా వాటిని కైలాస్ గైకావాడ్ తన మారుతి షిఫ్ట్ డిజైర్ కారు డిక్కీలో పెట్టుకొని విజయవా డ, సూర్యాపేట, నార్కట్ పల్లి, చౌ టుప్పల్, హైదరాబాద్, మహారా ష్ట్రకు వెళుతుండగా చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ ప్లా జా వద్ద ముందుగా అందిన నమ్మ దగిన సమాచారం మేరకు ఏసీబీ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ జి మన్మధ కుమార్, ఎస్సైలు కనుకటి యాదగిరి, ఎస్ కృష్ణ మల్, పోచంపల్లి ఎస్సై ఎల్ భాస్కర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ, కానిస్టేబుల్ లు సందీప్, భరద్వాజ్, హెచ్ జి పాప య్య తదితరులు కలిసి గంజా యిని అక్రమ రవాణా చేస్తున్న కారును పట్టుకొని నిందితుడు కైలాస్ గైకావాడ్ ను అదుపులోకి తీసుకోవడంతో పాటు గంజాయిని, కారును, నకిలీ నెంబర్ ప్లేట్లను, రెండు సెల్ ఫోన్ లను, రెండు వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు గా డిసిపి రాజేష్ చంద్ర తెలిపా రు.

నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచడం జరిగిందని,సేటు, వీరబాబు లపై కేసులను నమోదు చేయడం జరిగిందని తెలిపారు. డ్రగ్స్ మహమ్మారి నియంత్రణ కో సం ప్రజలు తమ వంతు సహకారం అందించాలని కోరారు. ఇదిలా ఉండగా కారులో అక్రమ రవాణా చేస్తున్న గంజాయిని పట్టుకోవడం లో చాకచక్యంగా వ్యవహరించిన ఏసీపీ, ఇన్స్పెక్టర్, ఎస్ఐలను, సి బ్బందిని డీసీపీ రాజేష్ చంద్ర అభి నందించారు. ప్రోత్సాహకంగా వారి కి నగదు పారితోషకాలను అందజే శారు.