Mahatma Gandhi University : ప్రజా దీవెన, నల్లగొండ:మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం అధ్యాప కుల గృహ సముదాయాన్ని ఉపకు లపతి ఆచార్య కాజా అల్తాఫ్ హు స్సేన్ అధికారులతో కలిసి శనివా రం ప్రారంభించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ అధ్యాప కులు నిత్యం అందుబాటులో ఉం డడం ద్వారా విద్యార్థులకు మెరుగై న సేవలతో పాటు నాణ్యమైన పరి శోధనలకు అవకాశం ఉంటుంద న్నారు.
ఎంజియూ సైతం ఐఐటి తరహా రెసిడెన్షియల్ క్యాంపస్ గా రూపు దాల్చడానికి ఇదొక ముంద డుగుగా దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచా ర్య అలువాల రవి, ఆచార్య ఆకుల రవి, డా శ్రీదేవి, ఆచార్య కొప్పుల అంజిరెడ్డి, డా వై ప్రశాంతి, డా ఉపేందర్ రెడ్డి, డా మద్దిలేటి, ఇంజనీర్ శైలజ తదితర అధ్యా పకులు విద్యార్థులు పాల్గొన్నారు.