–సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున
CPM Nagarjuna : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: చందనపల్లి చుట్టూ గ్రామాలకు యమపాశంలా మారిన చెత్త డంపింగ్ యార్డ్ ను వెంటనే ఎత్తివేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున డిమాండ్ చేశారు. మం గళవారం సిపిఎం ఆధ్వర్యంలో చెత్త డంపింగ్ యార్డ్ ను పరిశీ లించడం జరిగింది. సిపిఎం ప్రజా పోరుబాటలో భాగంగా నాగార్జున మాట్లాడుతూ రాష్ట్ర రోడ్లు భవనా ల శాఖ మంత్రి నల్గొండ నియోజ కవర్గ ప్రతినిధి అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి పుణ్యమా అంటూ చందనపల్లి,రామారo,సూరారం, పానగల్లు గ్రామాలకు శాపంగా మారిందని ప్రజల ఆరోగ్యాలు దెబ్బతిని అనేకమంది అవస్థలు పడుతున్నారని అన్నారు. దారిన బోయే పాదాచారులు వాహనదా రులకు తీవ్రమైనటువంటి ఇక్కట్లు కలుగుతున్నాయని ఆక్సిడెంట్లు జరిగి ప్రాణాలు పోతున్నాయని అన్నారు. తీవ్రమైన పొగ, ఈగలు దోమలు, కుక్కలు, ఊపిరాదాకా చేస్తున్నారని అన్నారు .
అధికారులు పరిశీలన చేయాలనీ తెలియజేశారు. ఎన్నికలలో చెత్త డంపింగ్ యార్డ్ ను తొలగిస్తామని వాగ్దానం చేశాడని సంవత్సరం దాటిన ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నించారు. చెత్త డంపింగ్ యార్డ్ తొలగించే వరకు సిపిఎం పోరాడుతుందని తెలియజేశారు. నల్గొండ జిల్లా సగభాగానికి మంచినీరు అందిస్తున్న పానగలు ఉదయ సముద్రం చెరువు చెత్త డంపింగ్ వలన కలుషితనీరుగా మారిందని ప్రజల జీవితాలతో చెలగాటమాడే ఈ చర్యలు ఏమిటని అన్నారు. అనారోగ్యాల పాలవుతున్న పాలకవర్గాలు పట్టించుకోవా అని ఆవేదన వ్యక్తం చేశారు. నెలరోజుల కార్యక్రమంలో భాగంగా చెత్త డంపింగ్ యార్డ్ తొలగించే వరకు ఉద్యమ పోరాటాలు నడుస్తాయని అంతిమంగా ఈ నెల 28న కలెక్టర్ కార్యాలయం ముందు మహా ధర్నా నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు కొండ అనురాధ మండల కమిటీ సభ్యులు ఉప్పుల గోపాలు, కొండ వెంకన్న గ్రామ కార్యదర్శి గంగుల యాదయ్య పండుగ లింగస్వామి రాములు, శ్రీనివాసు లక్ష్మయ్య వెంకన్న తదితరులు పాల్గొన్నారు.