Cab Driver : ప్రజా దీవెన, హైదరాబాద్: సరదా కబుర్లు దురద తీర్చినట్లయింది. ఓ సరదా సన్నివేశం కాస్తా నిండు ప్రా ణాలు బలి తీసుకున్న సంఘటన అందరిని ఆశ్చర్యపరిచింది. ఐరన్ బాక్స్ వైర్‌ను సరదా కోసం గొంతు కు చుట్టుకొని క్యాబ్ డ్రైవర్ కాబో యే భార్యకు ఫోటో పంపించాడు. అంత వరకు బాగానే ఉన్నా అను కోని ఆపద ముంచుకురావడంతో అసువులు బసాడు ఆ క్యాబ్ డ్రై వర్. కాబోయే భార్యకు రీల్ కోస మో లేదంటే మరుపురాని ఘట్టం కోసమో కాని ఐరన్ బాక్స్ వైర్ ను మెడకు చుట్టుకొని ఆడిన ఆట విషాదానికి దారి తీసింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కాచిగూడ తిల క్‌నగర్‌కు చెందిన క్యాబ్ డ్రైవర్ ఆదర్శ్(25) కాబోయే భార్యను ఆటపట్టించడానికి రాత్రి సమ యంలో ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్‌కు ఐరన్ బాక్స్ వైర్‌తో ఉరి వేసుకొని ఫోటో తీసుకొని కిందికి దిగే సమ యంలో వైర్ ఉరిగా బిగుసుకుంది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేక పోవడంతో ఊపిరాడక అక్కడిక క్కడే మృతి చెందాడు. వచ్చే నెల లోనే వివాహం ఉండగా ప్రమాదవ శాత్తు ఆదర్శ్ చనిపోవడంతో ఆ రెండు కుటుంబాల్లో విషాదఛా యలు అలుముకున్నాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.