Big breaking : ప్రజా దీవెన, హైదరాబాద్: సైబర్ నేరగాళ్ల దాడులు రోజులు దాడు లు శృతి మించిపోతున్నాయి. భూ ప్రపంచంపై సైబర్ దాడులు వారు వీరు అనే తేడా లేకుండా విశృంఖ లంగా కొనసాగుతూనే ఉన్నాయి. సైబర్ నేరగాళ్లపై ప్రభుత్వాలు ఎప్ప టికప్పుడు అలర్ట్ చేస్తూ ప్రమాదాల ను అనేక మార్గాలలో ప్రచారం చే స్తున్నప్పటికీ ఏదో మార్గంలో సైబర్ నేరగాళ్లు తమ దాడులు మరింత ముమ్మరం చేస్తున్నారు. తాజాగా సైబర్ దాడికి సంబంధించిన వీడి యో ఒకటి సాక్షాత్తు నల్లగొండ జి ల్లా నకిరేకల్ శాసనసభ్యుడు వీరే శానికి న్యూడ్ కాల్స్ తో సైబర్ నేర గాళ్లు ఎటాక్ చేసిన సంఘటన జరి గింది.
నకిరేకల్ ఎమ్మెల్యే వే ముల వీరేశం సోషల్ మీడియా అ కౌంట్లో నుండి ఫోటోలను సేకరించి త ద్వారా స్క్రీన్ రికార్డు పర్సనల్ నెంబర్ వాట్సాప్ కి పంపి బెదిరిం చారు సైబర్ మోసగాళ్లు. వీడియో కాల్ సైబర్ మోసగాళ్లు చేస్తున్నార ని వెంటనే పసిగట్టిన ఎమ్మెల్యే వీరేశం అప్పటికప్పుడే అలర్ట్ అ య్యారు. వాట్సాప్ చాటింగ్ ద్వా రా ఎమ్మెల్యే కి బెదిరింపు మెసేజ్ లు పంపిన సైబర్ నేరగాళ్లు వీడి యోలు ఫోటోలు సోషల్ మీడియా లో అప్లోడ్ చేయాలా లేదంటే డ బ్బులు పంపిస్తావా అంటూ బ్లాక్ మెయిలింగ్ చేయడంతో అప్ర మత్తమైన ఎమ్మెల్యే వెనువెంటనే పోలీసులను ఆశ్రయిoచారు. పో లీసుల సలహాతో ఎమ్మెల్యే వేము ల వీరేశం సైబర్ నేరగాళ్ల నెంబర్ బ్లాక్ చేశారు.