Road Accident : ప్రజా దీవెన ఏలూరు: ఆంధ్రప్రదేశ్ ఏలూరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఏలూరు ఆలూ రు జిల్లాలో గురువారం తెల్లవా రుజామున సోమవరప్పాడు హైవే చోదిమెళ్ల వద్ద సిమెంటు లారీని ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి ఢీకొట్టి పల్టీలు కొట్టి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమా దంలో ముగ్గురు అక్కడిక్కడే మృ తి చెందారు. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగా త్రులను స్థానికులు, పోలీసులు సమీపంలోని ఆస్పత్రికి తరలిం చారు.హైదరాబాద్ నుంచి కాకి నాడ వెళుతున్న రమణ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. పోలీ సులు కేసు నమోదు చేసుకున్నా రు.
అతి వేగం, నిద్రమత్తే ఈ ప్రమా దానికి కారణమని ప్రాథమిక నిర్ధార ణకు వచ్చారు.బస్సు ప్రమాదంపై మంత్రి పార్థసారధి దిగ్భ్రాంతి వ్య క్తం చేశారు ప్రమాదంలో మరణించి న వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపిన మం త్రి పార్థసారథి. ప్రమాద సంఘటన పై వివరాలను జిల్లా యంత్రాంగాన్ని అడిగి తెలుసుకున్నారు.ఇక క్షతగా త్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని ఫోన్ ద్వారా ఆసు పత్రి అధికారులకు ఆదేశించారు.