CITU : ప్రజాదీవెన , నల్గొండ : తెలంగాణ రాష్ట్రంలో 73 షెడ్యూల్డ్ ఎంప్లాయిమెంట్స్ లో కనీస వేతనాలు జీవోలు సవరించి గెజిట్ విడుదల చేసి 26 వేల కనీస వేతనాన్ని అమలు చేయాలని సిఐటి యు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాం డ్ చేశారు. గురువారం సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కలెక్టరేట్ ఏవో మోతిలాల్ కు వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కోటి 20 లక్షల మంది కార్మికులకు వర్తించే షెడ్యూల్డ్ ఎంప్లాయిమెంట్స్ లోని కనీస వేతనాల జీవోలు 2012 నుండి పెండింగ్ లో ఉన్నాయని వాటిని సవరించాలని ఎన్నో పోరాటాలు చేస్తే ప్రజా పాలన పేరుతో అధికా రంలోకి వచ్చిన ప్రభుత్వం వేతనాలు తగ్గిస్తూ గెజిట్ విడుదల చేసిం దని విమర్శించారు. పెట్టుబడుదారుల లాభాల కోసం వాళ్లకు అడు గులకు మడుగులోత్తడమే ప్రజాపాలన పద్ధతి అని ప్రశ్నించారు.
కనీస వేతనాల సలహా మండలి లో కేంద్ర కార్మిక సంఘమైన సిఐటి యు కి ప్రాతినిధ్యం లేకుండా చేయడం అంటే కార్మికుల తరఫున పోరాటాలను అడ్డుకోవడమేనని అన్నారు.2014 సంవత్సరం నాటి కంటే తక్కువ వేతనాలు నిర్ణయిస్తూ రేవంత్ సర్కార్ జీవోలు ఇవ్వ డం కార్మికుల పొట్ట కొట్టడమేనని విమర్శించారు పెరుగుతున్న ధరల నేపథ్యంలో కార్మికుల కనీస వేతనాలు లేక తీవ్రమైన దుర్భర పరిస్థి తుల్ని కార్మిక వర్గం ఎదురుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా ప్రభుత్వం షెడ్యూల్ పరిశ్రమల్లో కనీస వేతనాల జీవోలు సవరించి 26 వేలు బేసిగ్గా నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి చింతపల్లి బయ న్న, జిల్లా నాయకులు అద్దంకి నరసింహ, పోలే సత్యనారా యణ, వరికుప్పల ముత్యాలు,బొంగర్ల మల్లయ్య, నోముల యాదయ్య తదితరులు పాల్గొన్నారు.