journalist Raghu : ప్రజా దీవేన, కోదాడ : కోదాడ ఎలక్ట్రాక్ మీడియా జర్నలిస్టు పడిశాల రఘు ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన సంఘటన మీడియా రంగానికి తీవ్ర లోటని ఇండియన్ జర్నలిస్టు యూనియన్ జిల్లా అధ్యక్షులు గింజుల అప్పిరెడ్డి అన్నారు గురువారం ఐజేయు ఆధ్వర్యంలో పట్టణంలోని స్థానిక బంజర కాలనీ రఘు నివాస గృహానికి వెళ్లి రఘు కుటుంబాన్ని పరామర్శించి ఆయన చిత్రవటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం 20వేల రూపాయల ఆర్థిక సాాయాన్ని కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా అప్పి రెడ్డి మాట్లాడుతూ మీడియా రంగంలో రఘు కనపరిచిన ప్రతిభ ఎనలేనిదని కొనియాడారు.ఆయన మృతికి ఐజేయు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నట్లు తెలిపారు. జర్నలిస్టు రఘు కుటుంబానికి అండగా ఉంటామన్నారు.ఈ కార్యక్రమంలో కోదాడ ఐజేయు ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు సలిగంటి మురళి,ఆవుల మల్లికార్జున్, శ్రీనివాస్,దామోదర్,అజయ్,కరుణాకర్, రమేష్, శ్రీనివాస్, నాగరాజు తదితర జర్నలిస్ట్లు పాల్గొన్నారు.