Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Child Marriage : మసకబారిన మానవత్వం, తమిళ నాడులో బాల్యవివాహo

Child marriage : ప్రజా దీవెన, తమిళనాడు: సమాజంలో బాల్య వివాహాల పట్ల వెగటు పుడుతున్న రోజుల్లో కూడా అనాది ఆచారాలు ఇంకా కొనసా గుతూనే ఉన్నాయి. ప్రపంచం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు అవగాహనతో ముందుకు సాగుతున్న తరుణంలో ఇంకా బా ల్యవివాహాలు కొనసాగడం దురదృ ష్టకరంగా భావించాల్సిందే. ఇదిలా ఉండగా ఫ్రెంచి, పోర్చుగీసు, డచ్ వారు, బ్రిటీషు తదితర విదేశీ యు లు భారతదేశాన్ని పాలించు కాలం లో కొంతమంది విదేశీ అధికారులు భారతీయ కన్యలను బలవంతంగా వివాహమాడేవారు లేదా చెరచే వారు. వివాహితులను ఎత్తుకెళ్ళ రని భావించిన భారతీయులు త మ పిల్లలకు బాల్యంలోనే వివాహం చేసేవారు. కాగా కుటుంబాల మధ్య సంబంధ బాంధవ్యాలను పటిష్ఠ పరచుకోవడానికి ఆడపిల్ల పుట్టగానే తమ బంధువర్గంలో ప లానావాడికి భార్య పుట్టిందని ఇరు వర్గాలవారు నిర్ణయించేసుకొని పిల్ల లు కొంచెం పెద్దవారవ్వగానే వివా హం చేయడం ఆనవాయితీగా వ చ్చేది. కుటుంబాలలోని వృద్ధుల కో రిక మేరకు వారు చనిపోయేలోపు తమ వారసుల పెళ్ళిళ్ళు చూడాల నే కోరికను తీర్చడానికి కూడా బా ల్యవివాహాలు జరిపించేవారు. మ రికొన్ని కుటుంబాల్లో పిల్లలు యుక్త వయసు (Teenage) కు వచ్చిన తర్వాత వక్ర మార్గాల్లో ప్రయాణిస్తా రనే భావనతో ముందు జాగ్రత్తగా బాల్యవివాహాలు జరిపించడం పరిపాటిక కొనసాగింది.

బాల్య వివాహం జరిపించినప్పటికీ అమ్మా యి యుక్త వయసుకు వచ్చిన త ర్వాత మాత్రమే కాపురానికి పంపిం ఛేవారు. ఇలా చేయడం వల్ల అ మ్మాయికి అబ్బాయికి ఒకరిపై ఒక రు ఇష్టం ఉన్నా లేకపోయినా కలిసి జీవితం గడపాల్సివచ్చేది. అయితే కొన్ని కుటుంబాల్లో అమ్మాయికి ఊ హ తెలిసినా తెలియకపోయినా వ యసులో ఎక్కువ తేడా ఉన్న వ్య క్తులతో కూడా ఈ వివాహాలు జరి పించేవారు. ఒక వేళ వయసులో ఎక్కువ తేడా వల్ల పురుషుడు ముందుగా చనిపోయినప్పటికీ పునర్వివాహాలు ఉండేవి కావు. అందువల్ల అమ్మాయి చిన్నవయ సులోనే బాల వితంతువుగా మారి జీవితాంతం అలాగే ఉండాల్సివ చ్చేది. ఈ నేపథ్యంలో రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం పంతులు వంటి సంఘ సంస్కర్తల కృషి ఫలితంగా రాను రాను ప్రజల్లో బాల్యవివాహాల వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహ న పెరిగి బాల్యవివాహాలను నిషే ధించడం, పునర్వివాహాలను ప్రో త్సహించడం జరిగింది. ఇప్పటికీ మారుమూల గ్రామాల్లో అక్కడక్క డా అడపాదడపా ఇలాంటి బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నా యి.
తాజాగా తమిళనాడులో తార స పడిన సంఘటన… తమిళ నాడు కృష్ణగిరి జిల్లా హోసూర్ గ్రా మానికి చెందిన 14 సంవత్సరాల బాలికని బెంగుళూరులోని 29 సం వత్సరాల అబ్బాయికి ఇచ్చి బాల్య వివాహం చేసిన సంఘటన వెలు గులోకి వచ్చింది. అత్తగారి ఇంటికి వెళ్ళనని ఆ చిన్నారి ఏడుస్తూ భీ ష్పించుకొని కూర్చున్నా భుజాలపై ఎత్తుకొని మరీ పెళ్లి కొడుకు బల వంతంగా తీసుకెళ్లిన వీడియో నెట్టి ట్లో వైరల్ అయ్యింది. ఈ విషయం లో సమాచారం అందుకున్న పోలీ సులు బాల్యవివాహం అయిన బాలిక భర్త, భర్త తమ్ముడి తో పాటు బాలిక తల్లిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.