… వీరబోయిన రామాంజనేయులు యాదవ్ సీనియర్ జర్నలిస్ట్ &అడ్వకేట్ నల్గొండ..
Senior journalist Ramanjaneyulu :
ప్రజా దీవెన, హైదరాబాద్: ఈ సృష్టికి మూలం స్త్రీ.స్త్రీ లేనిదే ఈ సృష్టి లేదు. ఎక్కడైతే స్త్రీ గౌర వించబడుతుందో అక్కడ అభివృద్ధి జరుగుతుంది. లింగ వివక్షత చూడకుండా చూడడమే స్ట్రీకి మనమిచ్ఛే గౌరవం.
నాడు 1908లో అమెరికాలో కార్మిక స్త్రీలు శ్రమకు తగ్గ వేతనం పని దినాల తగ్గింపు, ఓటు హక్కు కోసం ప్రారంభమైన ఉద్యమం 1910 మార్చి 8విజయం సాధించారు .దీనికి ప్రతీకగా మొదట 2011, మార్చ్ 8,అంతర్జాతీయ మహిళా దినోత్సవం గా జరుపుకున్నారు.
భారతదేశము మహిళా సాధికారత దిశగా అడుగులు వేస్తున్నప్పటికీ మహిళలపై ఇప్పటికీ అత్యాచారాలు దౌర్జన్యాలు జరుగుతున్నాయి. మహిళలు ఆర్థికంగా, రాజకీయంగా, విద్యా, వైద్యం పరంగా ముందంజలో వున్నారు.
మహిళలకు రాజ్యాంగంలో అనేక చట్టాలు కల్పించిన కల్పించినప్పటికీ వాటి నిర్వర్తించడంలో ప్రభుత్వాలు వెనుక బడ్డాయి.
భారత ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లు ద్వారా చట్టసభలో 33% మహిళలకు కల్పించడం జరిగింది.
మహిళా అక్షరాష్యత 64.63% ఉండగా మహిళా జిడిపి 18% వుంది.
మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నారు. దేశ అత్యున్నత స్థాయి నుంచి గగనతల వైపు మహిళలు ముందుకు దూసుకుపోతున్నారు.
మహిళల సంక్షేమం కోసం భారత ప్రభుత్వం స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంది.
జాతీయ మహిళా కమిషన్ మహిళలపై జరిగే దాడులను అరికట్టి వారి సంక్షేమం కోసం కృషి చేస్తుంది.
కేంద్రం మహిళా సంక్షేమం కోసం బడ్జెట్లో 3 లక్షల కోట్లు కేటాయించింది.
మహిళలకు ఉచితంగా న్యాయం అందెందుకు లీగల్ ఎయిడ్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది.
మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు త్వరితగతిన శిక్షలు పడేందుకు నూతన చట్టాలను తేవడం జరిగింది.
స్త్రీలకు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా సమాన హక్కులను రాజ్యాంగం కల్పించింది.
మహిళల కోసం భారత ప్రభుత్వం అనేక చట్టాలను ఈసుకు రావడం జరిగింది.
ముఖ్యంగా రక్షణ కోసం గృహంస నిరోధక చట్టం,వరకట్న నిషేధ చట్టం,లింగ నిర్ధారణ ఎంపిక నిషేధ చట్టం, పనిచేసే ప్రదేశాలలో లైంగిక వేధింపుల నిరోధక చట్టం, ప్రసూతి ప్రయోజన చట్టం,నిర్భయ చట్టం తీసుకురావడం జరిగింది.
మహిళల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది ఇందులో ముఖ్యంగా జనని సురక్ష యోజన బేటి బచావో బేటి పడావో ఉజ్వల పథకం లాంటివి ప్రవేశపెట్టడం జరిగింది.
ఏది ఏమైనప్పటికీ మహిళలు ఆర్థికంగా రాజకీయంగా విద్యా వైద్యం పరంగా ఎదుగు తున్నప్పటికీ రక్షణ పరంగా ఇంకా అనేక ఇబ్బందులు ఎదురు కుంటూనే వుంటున్నారు. ఈ సమస్యను ప్రభుత్వాలు వెంటనే పరిష్కరించి మహిళల రక్షణ కోసం, రక్షణ యంత్రాంగాన్ని, మహిళా న్యాయం కోసం ఫాస్ట్రాక్ట్ కోర్టులు ఎక్కువ మొత్తం లో ఏర్పాటు చేసినప్పుడే వారి కళ్ళలో ఆనందం చూడగలుగుతాం..
ఇది మహిళలకు మనము ఇచ్చే నిజమైన అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు.