Principal Srinivasa Rao: ప్రజా దీవెన నాంపల్లి మార్చ్ 8. మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారు వారు సేవలు అభినందనీయమని ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు అన్నారు మండల పరిధిలోని ముష్టిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం రోజున మహిళ ఉపాధ్యాయులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారికి శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందించారు ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసరావు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని సాఫ్ట్వేర్ పైలెట్ రైలు ఉద్యోగాలలో ప్రథమ స్థానం లో ఉన్నారని పురుషుల కంటే మహిళలు తక్కువ కాదని నిరూపిస్తున్నారని అన్నారు.
మనదేశంలో రాష్ట్రపతి ఆర్థిక మంత్రి డైలీ ముఖ్యమంత్రి పదవిలలో మహిళలు ఉన్నారని విద్యార్థులకు గ్రామస్తులకు తెలిపారు మొట్టమొదట 1911లో జర్మనీ స్విట్జర్లాండ్లో నిర్వహించాలని 1975 నుండి ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారని తెలిపారు సమావేశంలో మహిళా ఉపాధ్యాయులు రమాదేవి రాజేశ్వర్ ఝాన్సీ మహిత లకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు శాలువాలతోఘనంగా సన్మానించారు అనంతరం మహిళా ఉపాధ్యాయులు తాము సాధించిన విషయాలను ఎదుర్కొన్న ఇబ్బందులను వివరించారు.
విద్యార్థులకు మంచిగా చదువుకొని ఉన్నత స్థానాలను సాధించాలని కోరారు వెంటనే విద్యార్థులు ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీధర్ రెడ్డి ఉపాధ్యాయులు సుధాకర్ రెడ్డి దామోదర చారి విష్ణు బాలాజీ ఇతరులు తదితరు లు పాల్గొన్నారు