— మల్లయ్య ప్రాణాలు కాపాడిన పవన్ సాయి హాస్పిటల్ వైద్యులు
— కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు
ప్రజాదీవెన నల్లగొండ టౌన్:
Pawan Sai Hospital: లివర్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న ఓ వ్యక్తికి పవన్ సాయి హాస్పిటల్ వైద్యులు స్వల్ప ఖర్చుతో ఖరీదైన వైద్యాన్ని అందించి అతని ప్రాణాన్ని కాపాడారు. వివరాల్లోకి వెళితే, ఆత్మకూర్ (ఎస్ )మండలం ఏపూర్ గ్రామానికి చెందిన సానబోయిన మల్లయ్య కొంతకాలంగా లివర్ సమస్యతో బాధపడుతున్నాడు. కాగా అతన్ని కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ఎల్బీనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాక్ టౌన్ కాలనీలో ఉన్న పవన్ సాయి హాస్పిటల్ లో చేర్చారు.
కార్పొరేట్ హాస్పిటల్లో లక్షల్లో ఖర్చు అయ్యే లివర్ వైద్యానికి జనహృదయనేత మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అలేటి శ్రీనివాస్ గౌడ్ సారధ్యంలో అతి తక్కువ ఖర్చుతో వైద్యులు మల్లెయ్యకు వైద్యాన్ని అందించారు. 15 రోజులు హాస్పిటల్ లో అడ్మిట్ చేసుకొని చికిత్స అందించారు. అతని లివర్ నుంచి సుమారు రెండు లీటర్ల చీమును తీసి అతని ప్రాణాన్ని కాపాడారు. ప్రస్తుతం అతడు కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఖరీదైన వైద్యాన్ని తక్కువ ఖర్చులు అందించిన డాక్టర్ ఆలేటి శ్రీనివాస్ గౌడ్ ను పలువురు అభినందించారు. కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.