Bollu Prasad : ప్రభుత్వం రైతాంగ సమస్యలను పరిష్కరించాలంటూ ధర్నా సాగుచేసిన భూములన్నిటికీ రైతు భరోసా నిధులు ఇవ్వాలి.: బొల్లు ప్రసాద్
Bollu Prasad: ప్రజా దీవేన, కోదాడ: ప్రభుత్వం రైతాంగ సమస్యలు అన్నిటిని పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం సూర్యపేట జిల్లా ఉపాధ్యక్షులు బొల్లు ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం కోదాడ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం నందు రాష్ట్ర రైతు సంఘం ఇచ్చిన పిలుపుమేరకు రైతులతో కలిసి ధర్నా నిర్వహించి ఆర్డీవో సూర్యనారాయణకి వినతి పత్రం అందించి మాట్లాడారు. ప్రభుత్వం నేటి వరకు రెండు లక్షలకు పైగా ఉన్న రైతులకు అనేక కారణాల చేత రుణమాఫీ కానీ రైతులకు వెంటనే నిధులు మంజూరు చేసి రైతులందరి రుణాలు మాఫీ చేయాలన్నారు.
సాగు చేసిన భూములు అన్నిటికి రైతు భరోసా నిధులు విడుదల చేయాలని ఖరీఫ్ లో రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యానికి నేటి వరకు కూడా బోనస్ డబ్బులు రైతుల ఖాతాలో జమ చేయలేదని కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి రైతు భరోస నిధులు ఇవ్వాలని కోరారు. ప్రస్తుత రబీ సీజన్లో రైతులు పండించిన సన్న రకం ధాన్యం హెచ్ఎంటి, సింట్లు రకం ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేసి బోనస్ ఇవ్వాలన్నారు. వరి పంటలు కోతదశకు వస్తున్నందున ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలన్నారు.
ఈ కార్యక్రమంలో రైతు సంఘం సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులు బొల్లు ప్రసాద్, ప్రధాన కార్యదర్శి దొడ్డ వెంకటయ్య, సిపిఐ మండల కార్యదర్శి బత్తినేని హనుమంతరావు నాయుకులు, పాపిరెడ్డి, మాతంగి ప్రసాద్, కమతం పుల్లయ్య, మాతంగి గాంధీ, కొండ కోటేశ్వరరావు, లతీఫ్, రెహమాన్, జానీ ఖాజా , మందరపు నాగేశ్వరరావుతదితరులు పాల్గొన్నారు