Heroine Soundarya: ప్రజా దీవెన ఖమ్మం: నటి సౌందర్య మృతిపై ఖమ్మం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి జిల్లా కలెక్టర్ కు సంచలన ఫి ర్యాదు చేశాడు.సౌందర్య ఆమె సోదరుడిని సినీ నటుడు మంచు మోహన్ బాబు హత్య చేయిం చాడని, ఆయనపై వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు లేఖ రాశాడు. అంతేగాక మంచు మోహన్ బాబు ద్వారా తనకు ప్రా ణహాని ఉన్నదని, ప్రాణ రక్షణ కల్పించాలని లేఖలో పేర్కొన్నాడు.
దీనికి సంబంధించిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లేఖ ప్రకారం నటి సౌందర్యకు శం షాబాద్ జల్‌పల్లిలో ఆరు ఎకరాల గెస్ట్‌హౌజ్ ఉందని, దానిని విక్రయిం చమని నటుడు మోహన్ బాబు అ డగగా సౌందర్య, ఆమె సోదరుడు అమర్నాథ్ నిరాకరించాడని తెలి పారు. దీనిపై కక్ష్య పెంచుకున్న మో హన్ బాబు బెంగుళూరు నుంచి తెలంగాణకు పార్టీ ప్రచారానికి వస్తు న్న వారిని సాక్ష్యాలు దొరకకుండా హెలికాఫ్టర్ ప్రమాదంలో హత్య చే యించాడని సంచలన వ్యాఖ్యలు చేశాడు.ఆ తర్వాత జల్‌పల్లి లో ఉ న్న ఆరు ఎకరాల గెస్ట్‌హౌజ్ ను అక్ర మంగా అనుభవిస్తున్నాడని, మం చు టౌన్ లో ఉన్న ఆ గెస్ట్ హౌజ్ ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని లేఖ ద్వారా ఖమ్మం రూరల్ మండ లం సత్యనారాయణపురం గ్రామా నికి చెందిన ఎదురుగట్ల చిట్టిమల్లు అనే వ్యక్తి కోరారు. అంతేగాక మో హన్ బాబు చిన్న కొడుకు మంచు మనోజ్ కి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే మోహన్ బాబుపై తగు చర్యలు తీసుకొని గెస్ట్ హౌజ్ ను స్వాధీనం చేసుకోవా లని లేఖ ద్వారా చిట్టిమల్లు కోరా రు.