Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Health :మానసిక రుగ్మతలు, క్షణాల్లో మాయమవుతోన్న జీవితాలు 

Health : ప్రజా దీవెన, హైదరాబాద్: మాన సిక రుగ్మతలు మానవ జీవితాల ను ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. ఎన్ని మార్గాల్లో ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా మానసిక ఒత్తిడి నుంచి బయటపడే వారి సంఖ్య చాలా తక్కువగా కనిపిస్తోంది. అసలు మానసిక ఒత్తిడి, ఆరోగ్యం పట్ల అవగాహన కల్పిస్తున్నారు ప్రముఖ గుండె మరియు ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ చిం తా ప్రభాకర్ రెడ్డి. ఆయన సూచ నలు ఆయన మాటల్లోనే.

 

డిప్రెషన్ అనేది ఒక మానసిక రుగ్మత అని మనం అనుకుంటాం.. అలా డిప్రెషన్ చెందిన వ్యక్తులు ఆత్మహత్య చేసుకోవడం లేదా ముఖ భావంగా ఉండిపోవడం మనం గమనిస్తూ ఉంటాం..

 

కానీ ప్రతి మనిషి కూడా డిప్రెషన్ కు ప్రతిరోజు గురవుతూనే ఉంటాడు.. కానీ ఆ ఆలోచన అనేది చాలా వీక్ గా ఉంటుంది.. ఆ తర్వాత వచ్చే మంచి ఆలోచనలో ఇది పల్చబడి పోతూ ఉంటుంది..

 

డిప్రెషన్ వచ్చినప్పుడు ఆ ఆలోచనను మరో మంచి ఆలోచనతో మార్చుకోవడమే టెక్నిక్.. బుద్ధ భగవానుడు చెప్పినట్లు కోరికలే అన్ని బాధలకు మూల కారణం.. కానీ కోరికలే లేకుండా మనిషి జీవించలేడు కదా అదే మనిషి ఎదుగుదలకు ముఖ్యం…

కానీ మనం అనుకున్నది జరగనప్పుడు మనకు ఇంతే ఉంది ఇలాగే జరుగుతుంది అని మనం అనుకుంటే అది ఫిలాసఫీ అవుతుంది.. అందుకే మనం భగవద్గీత కానీ మన సంస్కృతిలోని ఆధ్యాత్మికతగాని చిన్న వయసు నుంచే అలవర్చుకోవాలి.. చాలామంది వయసంత అయిపోయిన తర్వాత పుస్తకాలు చదివి ఆధ్యాత్మిక మార్గాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కానీ అప్పుడు వారు చేసేదేమీ ఉండదు…

 

కేవలం డబ్బుంటేనే మన సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అని చాలామంది భావిస్తూ ఉంటారు..దాని వెనక పరిగెడుతూ ఉంటారు.. మానవ సంబంధాలు అనేది పెద్దగా పట్టించుకోరు.. ఏ మానవసంబంధమైన మనకు అంతో ఇంతో డబ్బు వచ్చేదే అయ్యుండాలి అనే ఫిలాసఫీ చాలామందికి ఉంటుంది.. అవసరంలేని మిత్రుని కంచి గరుడ సేవ ఎందుకు అనే అభిప్రాయం చాలా మందికి ఉంటుంది…

 

మంచి మిత్రులు, మంచి పుస్తక పఠనం మరియు సత్సంగత్యం అనేది డిప్రెషన్ నుంచి బయటపడడానికి చాలా ఉపయోగపడుతుంది.. వీటన్నిటి కంటే కూడా మనకు ఆధ్యాత్మికత భావన మనకు జరగాల్సింది జరుగుతుంది.. మనకు ఇప్పటివరకు బాగా జరిగింది ఇంతకంటే బాగా జరగని వాళ్ళు చాలామంది ప్రపంచంలో ఉన్నారు అని తెలుసుకుంటే మన డిప్రెషన్ మటు మాయమైపోతుంది..

 

నేను అనుకున్నది ఏదైనా జరగకపోయినా లేదా ఎటువంటి అవాంతరం వచ్చినా నేను ఏమనుకుంటాను అంటే ఆ భగవంతుని దయవల్ల నాకు మంచి జీవితం ప్రసాదించడం జరిగింది. ఇంతకంటే ఈ జీవితంలో గొప్ప సాధించేదేం లేదు కావున మనకు వచ్చిన సమస్య చాలా చిన్నది మనకు లభించిన జీవితం చాలా గొప్పది.. అని అందరూ అనుకుంటే వాళ్లకు జీవితంలో డిప్రెషన్ ఎదురుకోవడం చాలా సులభం…మీరేమంటారు?