Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Group Results : గ్రూప్ II ఫలితాలలో రాష్ట్రస్థాయిలో ప్రధమ ర్యాంకు 

Group Result s : ప్రజా దీవేన, కోదాడ: పట్టణంలోని స్థానిక కె.ఆర్.ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎన్. రమణారెడ్డి కుమారుడు నారు వెంకట హర వర్ధన్ రెడ్డికి మంగళవారం ప్రకటించిన గ్రూప్-2 ఫలితాలలో 447.080 మార్కులు పొంది రాష్ట్రస్థాయిలో “ప్రధమ ర్యాంకు” పొందిన సందర్భంగా కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ క్రమశిక్షణతో, పట్టుదలతో సబ్జెక్టుని అర్థం చేసుకొని, పోటీ పరీక్షలో ప్రతి ప్రశ్న అని అర్థం చేసుకొని వ్రాసి రాష్ట్రస్థాయిలో (గ్రూప్ టు లో )ప్రధమ స్థానం పొందడం అభినందనీయమనితెలిపారు.

 

అభినందించిన వారిలో జి.లక్ష్మయ్య, ఆర్. పిచ్చి రెడ్డి, వేముల వెంకటేశ్వర్లు ,జి. యాదగిరి, వి. బల భీమ రావు,ఆర్. రమేష్ శర్మ, పి.రాజేష్, ఎం.రత్నకుమారి, బి. రమేష్ బాబు, జి. వెంకన్న, జి. నాగరాజు, పి.తిరుమల, ఎస్.గోపికృష్ణ, చంద్రశేఖర్, ఈ.నరసింహారెడ్డి,ఎస్. కే.ముస్తఫా,ఈ. సైదులు, ఎస్. కే.ఆరిఫ్,ఎన్. రాంబాబు,కే. శాంతయ్య,కే. జ్యోతిలక్ష్మి,ఆర్. చంద్రశేఖర్, ఎస్. వెంకటాచారి, టి. మమత, డి.ఎస్.రావు మొదలగువారు ఉన్నారు.