Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Chittoorfairing : కీలక మలుపు, దోపిడీకి ప్రముఖ వ్యాపారి పన్నాగం

కీలక మలుపు, దోపిడీకి ప్రముఖ వ్యాపారి పన్నాగం

Chittoorfairing: ప్రజా దీవెన చిత్తూరు: ఆంద్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలో ఈ రోజు తెల్ల వారు జామున కాల్పుల కలకలం రేగిన విష యం తెలిసిందే. అయితే సదరు కాల్పుల ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఓ ప్ర ముఖ వ్యాపారి ఇంట్లో మరో ప్రముఖ వ్యా పారి దోపిడీకి పన్నాగం పన్నినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తిం చారు. ఈ సంఘటన కథాక మీషు ఇలా ఉంది. చిత్తూరులోని గాంధీ రోడ్డులో ఉదయం కాల్పులు కలకలం సృష్టించాయి.

లక్ష్మీ సిని మా హాల్‌ సమీపంలో ఉన్న పుష్ప కిడ్స్‌ వరల్డ్‌ యజమాని చంద్రశేఖర్‌ ఇంట్లోకి దొంగల ముఠా చొరబడింది. రెండు తుపాకులతో వారు గా ల్లోకి కాల్పులు జరిపారు. యజ మాని అప్రమత్తమై పోలీ సులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు అక్కడికి చేరుకునిముఠా సభ్యు లను అదుపులోకి తీసుకున్నారు. తుపాకులు, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో యజ మాని చంద్రశేఖర్‌కు గాయాలయ్యాయి.

ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు చంద్రశేఖర్‌ ఇంట్లో దోపిడీ కి ఎస్‌ఎల్‌వీ ఫర్నీచర్‌ యజమాని ముఠాను ఏర్పాటు చేసినట్లు గు ర్తించారు. కర్ణాటక, ఉత్తారాదికి చెందిన దుండగులు ఈ ముఠాలో సభ్యులుగా ఉన్నా రు. రబ్బర్‌ బుల్లెట్లు వినియోగించే తుపాకులతో ఇంట్లో దోపిడీకి య త్నించారు. ఘటనాస్థలికి చేరుకు న్న పోలీసులు రెండున్నర గంటల పాటు ఆపరేషన్‌ నిర్వహించారు. దొంగల ముఠా ను అదుపులోకి తీసుకున్నారు.