–క్రిటికల్ కేర్ యూనిట్ ను త్వరలోనే ప్రారంభం
–జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
District Collector Tripathi : ప్రజాదీవెన నల్లగొండ : నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి ద్వారా ప్రజలకు ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఇతర ప్రాంతాలలో డిప్యూటేషన్ లో ఉన్న వారి డిప్యూటేషన్లను రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి రాష్ట్ర మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కు తెలిపారు.
నల్గొండ జిల్లా ప్రభుత్వ ప్రధానాస్పత్రి, ప్రభుత్వ వైద్య కళాశాలపై జిల్లా కలెక్టర్ బుధవారం తన ఛాంబర్లో రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు డాక్టర్ శివ రాంప్రసాద్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షించారు.డిప్యుటేషన్ల రద్దు తో పాటు, ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకిగాను అవుట్ సోర్సింగ్ పద్ధతిన నియమించుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు డిఎంఈ కి వివరించారు. అంతేగాక ప్రభుత్వ ప్రధానాస్పత్రిలో నిర్మించిన క్రిటికల్ కేర్ యూనిట్ ను త్వరలోనే ప్రారంభించనున్నట్లు ఆమె తెలిపారు. ప్రభుత్వ వైద్య కళాశాల సిబ్బందిని పెంచడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, ఈ పోస్టుల భర్తీకి సాధ్యమైనంత త్వరగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని చెప్పారు. అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, ప్రభుత్వ ప్రధానాస్పత్రి సూపరింటెండెంట్ అరుణకుమారి, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీవాణి, డిసిహెచ్ఎస్ మాతృనాయక్, డిప్యూటీ డిఎంహెచ్ఓ వేణుగోపాల్ రెడ్డి, డాక్టర్లు, తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు