DSP Sridhar Reddy : ప్రజా దీవేన , కోదాడ: పట్టణ మరియూ డివిజన్ పరిధి లోని అన్నీ గ్రామాల ప్రజలకు హోళీ పర్వ దినాని ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోదాడ డి.ఎస్.పి మామిళ్ళ శ్రీధర్ రెడ్డి అన్నారు హోలీ పండుగ సందర్భంగా కోదాడ DSP M. శ్రీధర్ రెడ్డి డివిజన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపినారు.
నేడు జరుపుకునే హోలీ పండుగ సందర్భంగా డిఎస్పి శ్రీధర్ రెడ్డి సిఐ కె శివశంకర్ మాట్లాడుతూ, హోలీ పండగ సందర్భంగా ఎవరూ కూడా వాహనదారులకి కానీ, రోడ్ పై వెళ్ళే ప్రయాణీకులకి కానీ ఎటువంటి ఆటంకం కలిగించే వద్దని వాహనదారులను ఆపి వారి వద్ద నుండి ఎటువంటి నగదు వసూలు చేయటం చట్ట ప్రకారం నేరమని అటువంటి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోటమని అదే విధంగా హోళీ సందర్భంగా రసాయనాలు, కుళ్లిన గుడ్లు, యాసిడ్స్.. తదితరాలు చల్లి ఇతరులకు ఆనారోగ్యాన్ని కలిగించవద్దు. సహజసిద్దమైన రంగులను వాడుతూ, మత సామరస్యాన్ని కాపాడుతూ, అంతా కలసిమెలసి పర్వదినం జరుపుకోవాలని తెలిపారు