–జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
–కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఘనంగా హోలీ వేడుకలు
Holi Festival : ప్రజా దీవెన నల్లగొండ : హోలీ పండుగ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ లు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆరోగ్యంగా ఉండాలని అన్నారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే హోలీ, దీపావళి లాంటి అన్ని పండగలను కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో కలిపి నిర్వహించుకోవడంలో ఆనందం ఉంటుందని అన్నారు. ఈ హోలీ పండుగ జిల్లా ప్రజలకు సుఖసంతోషాలను కలిగించాలని, అలాగే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆమె ఆకాంక్షించారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ తో పాటు, జిల్లా కలెక్టర్ భర్త ఐఏఎస్ అధికారి భవేష్ మిశ్రా, జిల్లా కలెక్టర్ కుటుంబ సభ్యులు, ఎస్పీ కుటుంబ సభ్యులు, కలెక్టర్ కార్యాలయ ఏఓ మోతిలాల్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.